తల్లిని, భర్తను కోల్పోయినా.. అన్నపూర్ణ స్టూడియోని ఒంటి చేత్తో నడిపిస్తున్న సుప్రియ ప్రతి ఒక్కరికీ ఆదర్శం…

0
6398

హీరోయిన్ సుప్రియ అనగానే ఏ తెలుగు ప్రేక్షకుడి కూడా గుర్తుపట్టలేరు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా లో నటించిన హీరోయిన్ సుప్రియ అనగానే ఎవరైనా టక్కున గుర్తుపట్టగలరు. సుప్రియ అక్కినేని నాగేశ్వర రావు పెద్ద కూతురు యార్లగడ్డ సత్యవతి కూతురు అలాగే హీరో సుమంత్ కి సొంత అక్క… అంటే అక్కినేని నాగార్జున కు స్వయానా మేనకోడలు. ఈమె తండ్రి యార్లగడ్డ సురేంద్ర ఒకప్పుడు పెద్ద తెలుగు సినిమా నిర్మాత. దురదృష్టవశాత్తూ సుప్రియ తన యుక్తవయసులోనే తల్లిని కోల్పోయారు. దీంతో అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ దంపతులు సుప్రియ సుమంత్ బాధ్యతలను భుజాలపై వేసుకొని వాళ్ళని సంరక్షించారు.

అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా ఆమెను హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసే స్టార్ హీరోయిన్ ని చేయాలని అక్కినేని కుటుంబం భావించింది కానీ మొదటి సినిమాతోనే ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదని అందరికీ తెలిసిపోయింది. దీంతో చేసేదేమీలేక ఆమెను సినిమా పరిశ్రమలో అంతగా నటింపజేయలేదు. తదనంతరం ఆమె చరణ్ అనే ఒక హీరో ని ప్రేమించి పెళ్లాడారు. మరోవైపు సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను చేపడుతూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే అన్నపూర్ణ స్టూడియోస్ కి సుప్రియ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు వ్యవహరించారు. అయితే సుప్రియ అన్నపూర్ణ స్టూడియోలో చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడతారని అనేక విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న సుప్రియ తమ అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసే అధికారులపై.. సినిమా, సీరియల్ షూటింగులు జరిపే దర్శక నిర్మాతలపై కూడా చాలా కఠినంగా వ్యవహరించేవారట. పనితనంలో చాలా నిక్కచ్చిగా ఉండే సుప్రియ యొక్క ప్రవర్తనను భరించలేని చాలామంది అన్నపూర్ణ స్టూడియో నుండి తరలిపోయి రామోజీ ఫిలిం సిటీ లో సినిమా షూటింగులు జరుపుకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయట.

ఇంత నిజాయితీగా ఉండే అక్కినేని సుప్రియ పెళ్లయిన కొన్ని సంవత్సరాల తర్వాత భర్త ను కూడా కోల్పోయారు. అయినా కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న స్ట్రాంగ్ ఉమెన్ గా పేరొందారు. ఈ విధంగా అన్నపూర్ణ స్టూడియోని ఒంటి చేత్తో ముందుకు నడిపిస్తున్న సుప్రియ అక్కినేని కుటుంబ సభ్యుల అందరిలో అనేక వ్యాపారాలను మేనేజ్ చేయగల నేర్పరిగా దూసుకెళ్తున్నారు. స్వయానా అక్కినేని నాగార్జున గారే సుప్రియ మాత్రమే అన్నపూర్ణ స్టూడియో ని సమర్థవంతంగా నడపగలరని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియో కోసం ఎంత శ్రమపడినా ఆమె సాధారణ ఉద్యోగిగా ఉంటూ కేవలం జీతం మాత్రమే తీసుకుంటూ తనకి ఉన్న ఒక్కగానొక్క కూతురుని పెంచి పెద్ద చేస్తున్నారు. ఈ విధంగా భర్తను కోల్పోయినా.. తల్లిని కోల్పోయినా.. ఏ మాత్రం మానసికంగా కుంగిపోకుండా స్ట్రాంగ్ ఉమెన్ గా జీవనాన్ని సాగిస్తూ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here