చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, నాగార్జున, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రారంభమయ్యి కొన్ని రోజులు చిత్ర షూటింగ్ జరుపుకొని మరీ అటకెక్కినవి ఎన్నో ఉన్నాయి.

ఇలా ప్రారంభమై కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న సినిమాల కారణంగా నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుంది. అలాగే హీరో దర్శకులకు కూడా భారీగానే నష్టం జరుగుతుంది. అభిమానులకు కూడా తీవ్ర నిరాశే మిగులుతుంది. అయితే ఇలా అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1997వ సంవత్సరంలో చిరంజీవి, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వినాలని ఉంది అనే సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. అశ్వినీదత్ నిర్మాణంలో ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలు కూడా చిత్రీకరణ జరుపుకున్నాయి. అయితే స్క్రిప్టు విషయంలో కొన్ని మార్పులు చేయాలని చిరంజీవి సూచించగా… రామ్ గోపాల్ వర్మ అందుకు నిరాకరించాడు. స్క్రిప్ట్ విషయంలో జోక్యం ఎవరు చేసుకోకూడదని ఒకవేళ చేసుకుంటే తాను సినిమా వదిలేయడానికి సిద్ధమని రామ్ గోపాల్ వర్మ నిక్కచ్చిగా ఉంటాడు. చిరంజీవి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. రాంగోపాల్ వర్మ స్క్రిప్ట్ మార్చడం అస్సలు కుదరదు కరాఖండిగా చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ సినిమా కోసం రూపొందించిన 2 పాటలను చూడాలని ఉంది సినిమాలో ఉపయోగించారు.

ఇంగ్లీష్ తో పాటు ఐదు భాషలలో సినిమా విడుదల చేయాలన్న ఉద్దేశంతో అబూబ్ బాగ్దాద్ గజదొంగ పేరుతో ఒక చిత్రాన్ని ప్రారంభించారు. చిరంజీవిని కథానాయకుడిగా పెట్టి హాలీవుడ్ లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం ప్రారంభించారు. అయితే సినిమా మొత్తం పూర్తి చేయాలంటే చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుందని, సినిమాలో మంచి తారాగణం కావాలంటే ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తుందన్న భయంతో ఈ సినిమాని మధ్యలోనే నిలిపివేశారు.

చిరంజీవి సింగీతం శ్రీనివాస్ కాంబినేషన్ లో భూలోక వీరుడు చిత్రం ప్రారంభమయ్యింది కానీ కొంత షూటింగ్ జరుపుకున్న తర్వాత అవుట్ పుట్ సరిగా రావడం లేదని చిరంజీవి ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. చిరంజీవి శ్రీదేవి హీరోహీరోయిన్లుగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న వజ్రాల దొంగ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీనికి కారణం ఈ సినిమా స్క్రిప్ట్ లో లోపాలు ఉండటమే.

బాలకృష్ణ ఎప్పటినుంచో తీయాలనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తనశాల సినిమా భారీ స్థాయిలో ప్రారంభం అయ్యింది. అయితే ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో నటించేందుకు సౌందర్య ని ఎంపిక చేసుకున్నారు చిత్రబృందం. కానీ దురదృష్టవశాత్తూ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో నర్తనశాల సినిమా ని అర్థంతరంగా ఆపివేశారు.

కోడి రామకృష్ణ బాలకృష్ణ కాంబినేషన్ లో విక్రమ సింహ భూపతి సినిమా 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే ఒకానొక రోజు కోడి రామకృష్ణ, బాలకృష్ణ ల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో ఈ సినిమా నేను చేయను పో అంటూ దర్శకుడు కోడి రామకృష్ణ తప్పుకున్నాడు. దీంతో బాలకృష్ణ చేసేదేమీ లేక ఇతర డైరెక్టర్ల కోసం వెతికాడు కానీ ఏ డైరెక్టర్ గా ఈ చిత్రాన్ని పూర్తి చేయలేక పోయాడు. దీంతో నిర్మాతకు, హీరో బాలకృష్ణ కి భారీగా నష్టం వాటిల్లింది.

హర హర మహా దేవా సినిమాలో కథానాయకుడిగా బాలకృష్ణ ను ఎంపిక చేసుకొని బి గోపాల్ కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించాడు. సముద్ర దర్శకత్వంలో కొంతవరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఒక సినిమాలో బాలకృష్ణ మిలటరీ పాత్రలో నటించాడు. అయితే ఏవో కారణాల వలన ఈ సినిమా మొదటిలోనే ఆగిపోయింది.

బి.గోపాల్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ తారాగణంతో బావమరిది అనే సినిమా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించడానికి శోభన్ బాబు ని ఎంపిక చేసుకున్నారు. మొదటిలో సినిమాకు ఓకే చెప్పేసిన శోభన్ బాబు ఆ తర్వాత తన క్యారెక్టర్ అస్సలు నచ్చలేదని తాను నటించబోనని చెప్పేసి తప్పుకున్నాడు. కీలకమైన పాత్రలు పోషించడానికి శోభన్ బాబు ఒప్పుకోకపోవడంతో సినిమా ముందుకు సాగలేదు. దీంతో బి.గోపాల్ ఈ సినిమాని అర్ధాంతరంగా నిలిపివేశాడు. ఇదే కథతో బావ బావమరిది పేరుతో తెరకెక్కిన సినిమాలో సుమన్.. శోభన్ బాబు పాత్రలో నటించాడు. పెద్ద వంశీ దర్శకత్వంలో వెంకటేష్ తారాగణంతో నాలుగు రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న గాలిపురం స్టేషన్ ఏవో కారణాల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయింది. మారుతి దర్శకత్వంలో రాధా అనే సినిమాలో నటించేందుకు వెంకటేష్ ఒప్పుకున్నాడు కాని చివరి నిమిషంలో స్క్రిప్టు నచ్చక ఆ సినిమాని పక్కన పెట్టేసాడు. దర్శకత్వం లో కొంత వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో హీరోగా వెంకటేష్ నటించాడు కానీ అదికూడా ఆరంభంలోనే ఆగిపోయింది.

పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో 12 చిత్రాలు మొదలై అర్ధాంతరంగా ఆగిపోయాయి. తానే రాసుకున్నా స్క్రిప్టుతో తానే దర్శకత్వం వహించాలనుకున్న సత్యాగ్రహి సినిమా లో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఒక ఫైట్ సన్నివేశం కూడా పూర్తయింది. ఎందుకో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాని మధ్యలోనే ఆపి వేశాడు. నువ్వేకావాలి సినిమా ని అమీషా పటేల్, పవన్ కళ్యాణ్ ని హీరోహీరోయిన్లుగా ఎంపిక చేసుకొని చిత్రీకరణ ప్రారంభించారు. 70 శాతం వరకు చిత్రీకరణ పూర్తయిన సమయంలో ఈ సినిమా మలయాళం కి రీమేక్ కావడంతో రీమేక్ రైట్స్ విషయంలో ఏదో ఒక గొడవ జరిగింది. దీంతో ఈ చెప్పాలని ఉంది సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది.

మహేష్ బాబు హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన కుర్రాడు, రవితేజ హీరోగా నటించిన పవర్, నాగచైతన్య హీరోగా నటించిన దుర్గ సినిమా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ప్రారంభమై పూర్తి అవకుండా ఆగిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here