సినిమా డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించి, ఆ తర్వాత నిర్మాతగా మారి, థియేటర్లను తన ఆధీనంలోకి తీసుకుని, యువి, గీతా ఇలా అందరినీ కలుపుకుని ఇప్పుడు టాలీవుడ్ నే శాసించే స్థాయికి ఎదిగారు దిల్ రాజు. అందుకే టాలీవుడ్ ప్రముఖులందరూ ఆయన్ని గోల్డెన్ రాజు అంటుంటారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మన దిల్ రాజు ఓటిటి రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

అయితే డైరెక్ట్ గా దిల్ రాజు OTT ప్లాట్ ఫామ్ ను స్టార్ట్ చేయడం లేదు. కంటెంట్ తయారీ, అలాగే ఎవరైనా ఓటిటికి ఏమైనా కంటెంట్ విక్రయించాలన్నా, తయారు చేయాలన్నా మధ్యవర్తిగా వ్యవహారించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు వేరే వాళ్లతో కలిసి శాటిలైట్ రైట్స్ కొనుగోలు, అమ్మకాల వ్యాపారం వుంది అని టాలీవుడ్ టాక్. ఇప్పుడు అదే పద్ధతిలో OTT రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నారని తాజా సమాచారం. ఇదిలా వుండగా.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈమధ్యనే వైఘా రెడ్డి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మే 10న నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లిలోని శ్రీవెంకటేశ్వర దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది.

పెళ్లైన తర్వాత వీళ్ళిద్దరూ తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. మొదటి సారి సతీ సమేతంగా తిరుమల సందర్శించిన ఆయన లుక్ చూసి అందరూ ఆశ్చర్య పోయారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం దిల్ రాజు తన కుటుంబానికే ఎక్కువ టైం కేటాయిస్తూ తన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. వీరి అన్యోన్యమైన దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుందని ఫ్యాన్స్ కి తెలిసేలా అప్పుడప్పుడు వీరి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లేటెస్ట్ గా దిల్ రాజు తన భార్యతో కలిసి దిగిన ఇచ్చిన రొమాంటిక్ స్టిల్ సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది.

ఈ ఫోటోలో దిల్ రాజును బాగా అబ్జర్వ్ చేస్తే తెలిసిందేమిటంటే.. 2వ పెళ్లి తరువాత దిల్ రాజులో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా దిల్ రాజు తన బాడీ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాడని అర్థమౌతోంది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కూడా అంతంత మాత్రంగానే వుండటంతో ఖాళీ సమయాలలో ఫిజికల్ ఫిట్నెస్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వెయిట్ తగ్గడమే కాకుండా బాడీ షేప్ కూడా మార్చే పనిలో పడ్డాడట దిల్‌రాజు. ఈక్రమంలో రెగ్యులర్ గా జిమ్ సెషన్ లో పాల్గొనడంతో పాటు తన భార్యతో కలిసి బ్యాడ్మింటన్ కూడా ఆడుతున్నాడు. మొత్తానికి మన గోల్డెన్ రాజు టాలీవుడ్ యంగ్ హీరోలకే పోటీ ఇచ్చేంత స్లిమ్ గా హీరోలా తయారయ్యాడన్నమాట.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here