తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మేటి నటి, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డును సాధించిన విజయనిర్మల మరణించిన సంగతి తెలిసిందే.

చిన్నతనంలోనే సినీ నట జీవితం ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. అయితే ఆమె అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విజయ నిర్మల మరణించారన్న విషయాన్ని ముందుగా ఆమె కుమారుడు, సినీ నటుడు నరేశ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. అయితే మీడియాకి ఆమె హార్ట్ ఎటాక్ తో మరణించినట్టు సమాచారం అందింది. కానీ ఆమె మరణం వెనుక మరో కారణం ఉందని ఈమధ్యనే ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిజం ఎంతో తెలీని ఈ రూమర్ మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం విస్తృతంగా సంచారం చేస్తుంది. అదేమిటంటే..

ఆమె మరణానికి కారణం క్యాన్సర్ అని.! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమనే రూమర్ ఫిల్మ్ నగర్ లో బలంగా వినబడుతుంది. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కావాలనే దాచి పెట్టారని, క్యాన్సర్ అని తెలిస్తే ఫ్యాన్స్, ప్రముఖులు ఆమెను పరామర్శించేందుకు క్యూ కడతారని, క్యాన్సర్ తో బాధపడే వారికి ధైర్యం చెప్పేవారు కావాలి కానీ ఇలా పరామర్శించడానికి వస్తే మరింత క్రుంగిపోయే అవకాశం ఉందని తెలియడంతో ఈ విషయాన్ని బయట పెట్టలేదని అంటున్నారు. ఇందులో నిజం ఎంతుందనేది లోగుట్టు పెరుమాళ్ళుకెరుక.!






























