సినిమాలలో హిరో కి సమానమైన పాత్ర ఏది అంటే విలన్. సినిమాలలో విలన్ పాత్ర ఎంత బాగుంటే హిరో అంత హైలెట్ అవుతాడు. ఏది అదే చెప్పుకోవాలి. మన టాలీవుడ్ విలన్స్ యాక్టింగ్ లో ఏ మాత్రం తీసుపోరు. సినిమాలలో పగ, ద్వేషం, చంపడం వంటి వాటితో. కృరంగా ఉండే విలన్స్ భార్య ఏలా ఉంటారో అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది.

కాని ఇక్కడ మన విలన్స్ వైఫ్స్ ను చూస్తే మాత్రం మతి పోతుంది. అంత అందంగా ఉంటారు మరీ. ఆ విలన్స్ భార్యలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ విలన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది..
రఘువరణ్

ఇతను ఒక్కప్పటి ఫెమస్ విలన్. 1982 తమిళ సినిమా ద్వారా తెరగేట్రం చేశారు రఘువరన్.. తెలుగు సినిమాలతో పాటూ తమిళ, మళీయాల సినిమాలలో నటించి ఎన్నో ఫిలీం ఫేర్ అవార్డులు అందుకున్నారు. బాషా, శివ సినిమాలలో విలన్ గా రఘువరన్ నటనను ఎప్పటికీ గుర్తుండిపోయేది. అంతగా విలన్ పాత్రలను పండించారు.

అయితే రఘువరన్ ప్రేమించి పెళ్లి చేసకున్నారు. ఆమె ఎవరో కాదు నటి రోహిణీ చిన్ననాటి నుంచి సినిమాలలో నటించిన రోహిణి ఇప్పటి వరకు 70 పైగా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు రైటర్ గా.. లిరిసిస్ట్ గా.. డైరెక్టర్ గా.. డబ్బింగ్ అర్టిస్ట్ పలు రంగాల్లో రాణిస్తుంది. ఇక హీరోయిన్లు జ్యోతిక, ఐశ్వర్య రాయ్, మనిషా కోయిరాల, అమల లకు డబ్బింగ్ చెప్పేది రోహిణి. రఘవరన్ కి ఇంత అందమైన తెలివైనా భార్య ఉందని ఇప్పటికి చాలామందికి తెలియదు.
అవినాష్

ఒక్కప్పటి ఫేమస్ విలన్. ఇతను కన్నడ నటుడు. అయిన కూడ తెలుగు లో చాలా సినిమాలలో చేశాడు. ఇతడు చేసిన విలన్ పాత్రలు అవినాష్ కు మంచి గుర్తింపును తెచ్చపెట్టాయి. అవినాష్ రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నాడు 1600 పైగా చిత్రాలలో నటించాడు. సంక్లిష్ట పాత్రలు మరియు వైవిధ్యత పాత్రల్లో ఎక్కువగా నటించాడు. అవినాష్ భార్య మాలవిక ఒకప్పటి కన్నడ టాప్ హిరోయిన్. మాలవిక తండ్రి చిత్ర పరిశ్రమకు చెందిన వాడు కావడం. చిన్నప్పటి నుంచి నృత్యం నెర్చుకోవడం.

వీటితో మాలవిక సినిరంగ ప్రవేశం సులువుగా జరిగిపోయాయి. ఈమె తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించింది. హిరోయిన్ గా తన హవాను చూపించిన మాలవిక, అవినాష్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడ ఉన్నాడు. మాలవిక పెళ్లి తరువాత కూడ టెలివిజన్ సిరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే వచ్చిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ లో కూడా ఆమె నటించింది.
అతుల్ కులకర్ణి

పేరుకు తగ్గట్టుగానే గొప్ప విలన్.. తెలుగు, హిందీ, కన్నడ, మరాఠి, ఇంగ్లీష్ బాషల్లో నటించాడు.. ఎన్నో అవార్డులను కూడ అందుకున్నాడు. ఆంధ్రవాలా, చంటి, రామ్ సినిమాలలో విలన్ గా చేసిన కుల్కర్ణి భార్య ఏంత అందంగా ఉంటుందో తెలుసా అంతేకాదు కూడా గోప్ప నటి. కుల్కర్ణి భార్య గీతాంజలి కుల్కర్ణి ఈమె కూడ మంచి యాక్టర్. దాదాపుగా అన్ని బాషాల్లో నటించింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బిజినెస్ రంగంలో రాణిస్తు కుటుంబాన్ని చూసకుంటుంది. అన్నింటిలో భర్తతో సమానంగా దూసుకుపోతుంది.
ఆశీష్ విద్యార్థి

ఇతను మన టాలీవుడ్ ఫేమస్ విలన్. ఆశీష్ ‘వందేమాతరం’ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమయ్యాడు. విలన్ పాత్రలను పండించడంలో దిట్ట. అంతేకాదు తాను నటించిన సినిమాలకు నేషనల్ అవార్డులను కూడ అందుకున్నాడు. తెలుగులో చేసింది కోన్ని సనిమాలే అయినా మంచి పేరు సంపాధించుకున్నాడు ఆశీష్. కన్నడ, తెలుగు, హిందీ, మళీయాలం సినిమాలలో నటించిన ఈ విల అన్ వైఫ్ పేరు రాజోషి విద్యార్థి. పేరుకు తగ్గట్టుగానే ఎంతో అందంగా ఉంటుంది.
మురళీ శర్మ

బాలీవుడ్, టాలీవుడ్, మరియు టెలివిజన్లలో ప్రధానంగా నటించిన భారతీయ చిత్ర నటుడు. మురళీ తెరపై ఒక పోలీసు పాత్రలు పోషించి అందరిని మెప్పించాడు. మురళీ శర్మ తెలుగు లో విలన్ గా నటించిన అతిథి, గోపాల గోపాల, కృష్ణం వందే జగద్గురు వంటి తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మురళీ వైప్ కూడ తనకు ఏ మాత్రం తీసిపోదు. మురళీ భార్య ఆశ్విని కాల్ సెకర్ ఈమె ఒక ఫేమస్ యాక్టర్. ఈమె హిందీలో అనేక సిరియల్స్ లో నటించింది. తెలుగులో కూడ కొన్ని సినిమాలు చేసింది. బద్రినాథ్ సినిమాలో మురళీ భార్య మురళీ విలన్ గా నటించింది.
బిజు మీనన్

ముందుగా మనకు గర్తోచ్చే సినిమా రణం. రణం సినిమాలో విలన్ పాత్ర ద్వారా బాగా దగ్గరయ్యాడు. అతను తమిళ, తెలుగు చిత్రాలతో పాటు 100 మలయాళం చిత్రాలలో నటించారు. అతను 1995 లో పుత్రన్ లో తొలిసారిగా చేసాడు బిజు మీన న్ భార్య పేరు సంయుక్త వర్మ. బిజు భార్య సంయుక్త వర్మ ఒకప్పటి ఫేమస్ మళీయాల హిరోయిన్. ఈమె 1999 లో హీరోయిన్ గా పరిచయమయ్యారు. తర్వాత ఆమె పలు మలయాళ చిత్రాలలో నటించింది. ఉత్తమ నటిగా రెండు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. కొన్నాళ్ళు హిరోయిన్ గా చేసింది. బిజు మీనన్ ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం కుటుంబాన్ని చూసుకుంటుంది.































