ప్రేక్షకుడిగా వెళ్ళిన థియేటర్ లోకే..తిరిగి తన కటౌట్ తో ఎంట్రీ ఇచ్చిన హీరో..?

0
325

విశాల భాగ్యనగరం భోగభాగ్యాల కు దన్యాగారం..తిమ్మిని బమ్మిని చేసే వారికి ఓ వరం.. అర్ధాకలి జీవితాలకు ఓ భారం.. అలాంటి మహా నగరంలో మామూలు వర్క్ షాపులో పనిచేస్తూ చాలీచాలని తన తండ్రి జీతానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. ఆ సమయంలో బాలనగర్ లోని వర్క్ షాప్ కు ఎదురుగా ఉన్నా శోభన థియేటర్ లో ఎన్టీఆర్, కృష్ణ,చిరంజీవి లాంటి హీరోల సినిమాలు చూసి శ్రీహరి మురిసిపోయేవాడు. ఎప్పటికైనా అలాంటి గొప్ప నటుడిని కావాలని కళలు కనేవాడు.అలాగే ఇదే థియేటర్ ముందు తన కటౌట్ చూపించాలనుకున్నాడు.

సినీ నటుడు కావాలన్న ఆలోచన బాగుంది.. కాని సినిమాలలోకి ఎలా వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి. ఒకవేళ సినిమాల్లోకి వెళితే తనకంటూ ఒక భిన్నమైన మాడ్యులేషన్ ఉండాలి. అది బాడీ లాంగ్వేజ్ కావచ్చు లేదా బాడీ బిల్డప్ కావచ్చు.. తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని అప్పటి నుండి జిమ్ కు వెళ్ళడం జిమ్నాస్టిక్ చేయడం లాంటివి చేసేవాడు. ఆ క్రమంలో అనేక రాష్ట్ర జాతీయ స్థాయిలో జిమ్నాస్టిక్ కాంపిటీషన్స్ లో ఎన్నో బహుమతులు గెల్చుకున్నాడు. ఆ బహుమతులను చూసిన తన తల్లిదండ్రులు ఎంతో ఆనందించేవారు. అలా రైల్వే,పోలీస్ డిపార్ట్మెంట్స్ లో స్పోర్ట్స్ కోటాలో తనకు ఉద్యోగం వచ్చిన స్వచ్ఛందంగా వదులుకొని సినిమానే తన జీవితం, సినిమాల్లోకి ఎలాగైనా వెళ్లాలని ఆలోచించేవాడు.

శ్రీహరి తన ఫోటోలను తీసుకొని సినిమా ఆఫీస్ ల వెంబడి తిరగడం ప్రారంభించాడు.ఆ క్రమంలో వంగవీటి మోహన రంగ పరిచయమయ్యారు. అయనతో దాసరి నారాయణరావు గారికి దగ్గరై.. అలా దాసరి దర్శకత్వం వహించిన బ్రహ్మనాయుడు సినిమాలో శ్రీహరికి ఓ వేషం వచ్చింది. ఇక అక్కడి నుంచి టూ టౌన్ రౌడీ, లంకేశ్వరుడు, రౌడీ ఇన్స్పెక్టర్, అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా లాంటి సినిమాల్లో విలన్ గా చేసిన తర్వాత పోలీస్ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. అలా ఆనాటి శోభన థియేటర్ కు వెళ్లి గత స్మృతులను గుర్తుచేసుకోని అక్కడ తాను నటించిన పోలీసు సినిమా కటౌట్ చూసి శ్రీహరి ఎంతగానో పొంగిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here