ఎన్నో మాయమాటలు చెప్పి ఎంతోమంది బడా వ్యాపార వేత్తలను,ప్రముఖ సినీ హీరోలను, హీరోల భార్యలను మాయలో పడేసి వారి నుంచి కోట్లకు డబ్బులు తీసుకొని మోసం చేసిన శిల్పా చౌదరి బాధితులు ఎంతో మంది ఉన్నారు. రోజురోజుకు ఈమె బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు.

గత రెండు రోజుల క్రితం మహేష్ బాబు సోదరి సుధీర్ బాబు భార్య ఈమె మాయలో పడి డబ్బు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మరో యంగ్ హీరో శిల్పా చౌదరి మాయలోపడి ఏకంగా మూడు కోట్ల రూపాయల పోగొట్టుకున్నట్లు బయటపడింది.
సెహరి సినిమాలో హీరోగా నటించిన హర్ష్ కనుమల్లి కూడా శిల్పా చౌదరి మాయలోపడి ఏకంగా మూడు కోట్ల పోగొట్టుకున్నట్లు వెల్లడించారు. ఇలా ఎంతో మంది బడా వ్యాపారవేత్తలను సినీ హీరోలను మాయమాటలతో మోసం చేస్తూ కోట్లలో డబ్బు తీసుకుని వారిని మోసం చేసిన శిల్పా చౌదరిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈమెను, తన భర్తను నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఇలా వీరు అరెస్టు కావడంతో వెంటనే ఆమె భర్తకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా శిల్ప చౌదరి మాత్రం రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలోనే ఉంచాలని కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే శుక్ర, శని వారాలలో పోలీసులు ఈ విషయంపై తనను విచారించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా ఏలాంటి విషయాలు బయట పడతాయో తెలియనుంది.































