తాజాగా బాలీవుడ్‌లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మ్రోగిస్తుందని తెలియగానే బాలీవుడ్ సెలబ్రిటీలందరూ వణికి పోతున్నారు. ముఖ్యంగా అమితాబచ్చన్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ రావడంతో ఈ భయం మరింత ఎక్కువైంది. కరోనా తొలి దశలో వున్నప్పట్నుంచీ ఎన్నో జాగ్రత్తలు చెప్పడమే కాకుండా, తను కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటున్నట్టు చెప్పిన అమితాబ్‌ లాంటి సూపర్ సెలెబ్రిటీనే కరోనా వదల్లేదంటే.. ఇక మనమెంత.? అనే భావన ఇప్పుడు సినీ ప్రముఖులందరిలోనూ బలంగా నాటుకుపోయింది. అసలు జరిగిందేమిటంటే.. అమితాబ్ జడ్జిగా చేస్తున్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ షో కోసం చేసిన ఆడిషన్స్‌లో పాల్గొనడం వలనే అతనికి కరోనా వచ్చిందనే గాసిప్స్ ఇప్పుడు టీవీ.. మరియు సినీ ఇండస్ట్రీలను భయ పెడుతున్నాయి.

అందుకే ఎక్కడి షూటింగ్స్ అక్కడ నిలిపివేసి.. కొంతకాలం ఇంటికే పరిమితం కావడం మంచిదనే నిర్ణయానికి సెలబ్రిటీలందరూ వచ్చినట్లుగా తెలిసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. తాజాగా బాలీవుడ్ ప్రముఖులు తీసుకున్న నిర్ణయం తాలూకు ఎఫెక్ట్ టాలీవుడ్‌ పై కూడా పడింది. టాలీవుడ్‌ లోని ప్రముఖ బుల్లితెర యాంకర్స్ కూడా షూటింగ్స్‌ కు గుడ్ బై చెప్పేస్తున్నారనే గాసిప్ సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఇందుకు ఉదాహరణగా చెప్పాలంటే.. లేటెస్టుగా మన టాలీవుడ్ టాప్ యాంకర్స్‌గా మంచి పేరున్న సుమ, అనసూయలు ఇకపై ఏ షూటింగ్‌లో పాల్గొనకూడదనే నిశ్చయించుకున్నారట. తెలుగు చిత్ర సీమలో కూడా కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తున్న నేపథ్యంలో.. ఇకపై వీరిద్దరూ షూటింగులకి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. యాంకర్లుగా వీరిద్దరూ ఎన్నో షోలు చేస్తుంటారు. ఆ షోల నిమిత్తం షూటింగ్స్‌ లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ కరోనా ప్రభావంతో పరిస్థితులు దారుణంగా మారుతుండటంతో.. షూటింగ్స్ కి దూరంగా వుండటమే మంచిదని వాళ్ళిద్దరూ భావిస్తున్నారని సమాచారం. దీంతో వీళ్ళిద్దరూ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు మహిళ ప్రేక్షకులకు ఈటీవీలో ప్రసారం అయ్యే ‘స్టార్‌ మహిళ’ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 12 ఏళ్లుగా కొనసాగుతున్న స్టార్‌ మహిళ కార్యక్రమం 3 వేల ఎపిసోడ్స్‌కు పైగా పూర్తి చేసుకుంది. ఇంత భారీ స్థాయిలో, ఎక్కువ రోజులు ప్రసారం అయిన షోగా స్టార్‌ మహిళకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు దక్కింది. ఈటీవీలో మద్యాహ్నం ఒంటి గంటకు ప్రసారం అయ్యే ఈ షోకు మహిళల నుండి మంచి ఆధరణే లభించింది. సుమ మహిళలతో ఆడిచ్చే ఆటలు షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ షోలో పాల్గొనేవాళ్ళ కాస్ట్యూమ్స్‌ విషయంలో కూడా మంచి టాక్‌ ఉంది. ఆడవారు స్టార్‌ మహిళ చూస్తున్నారు అంటే ఆ షోలో వాళ్ళు ధరించే చీరలు, డ్రస్‌లు కూడా ఒక ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.

ఇంతటి ఘన విజయాన్ని దక్కించుకున్న స్టార్‌ మహిళ షోకు గుడ్‌బై చెప్పబోతున్నట్లుగా సుమ ఒక్కసారిగా ప్రకటించడంతో మీడియా మొత్తం షాకైంది. గత 12 ఏళ్ళుగా నన్ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని ప్రకటించిన సుమ మహిళ లోకానికి పెద్ద షాకే ఇచ్చింది. సుమ సడెన్ గా ఇంత సంచలనాత్మకమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నదా.? అని ఆరా తీస్తే ఓ ఆసక్తికరమైన విషయమే వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. సుమ గత కొంత కాలంగా గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతుంది. దీంతో ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితి రావడంతో కొన్ని షోల ఆఫర్లను తిరస్కరించడంతో పాటు, ఆడియో ఫంక్షన్లకూ కూడా సుమ హాజరు కాలేక పోయింది. తాజాగా స్టార్‌ మహిళ షో నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించేసింది. ఇక ఈ షో నుండి సుమ తప్పుకుంటున్న సందర్భంగా మరో యాంకర్‌ తో ఈ కార్యక్రమంను కొనసాగించవచ్చు. కాని షో నిర్వాహకులు మాత్రం సుమ లేని స్టార్‌ మహిళను కొనసాగించడం బాగోదని షోను కూడా ముగించేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here