బిత్తరి సత్తికి కరోనా పాజిటివ్ ! భయపడుతున్న మాటీవి నటీనటులు..

0
172

తెలుగు న్యూస్ ఛానెల్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న బిత్తిరి సత్తి ఈమధ్యనే కరోనా వైరస్ బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆతను హోమ్ క్వారంటైన్ లో ఉంటూ.. కరోనాకు తగిన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని తాజా సమాచారం. వివరాల్లోకి వెళ్తే..

టీవీ 9 ఛానల్ నుంచి బయటకొచ్చి ఈమధ్య కాలంలో సాక్షి న్యూస్ ఛానెల్ లో చేరిన బిత్తరి సత్తి “గరం గరం వార్తలు ” అనే కార్యక్రమాన్ని ఈ ఛానెల్ లో పరిచయం చేశాడు. సాక్షి ఛానెల్ TRP రేటింగ్ లలో తొలి 4 స్థానాల్లో ఈ ఛానెల్ నెం.1 గా నిలిచింది. కానీ., బిత్తరి సత్తి విషయంలో అందరూ విస్తుపోయే విషయమేమిటంటే.. ఒక వైపు ఈ ప్రొగ్రామ్ అలా క్లిక్ అవ్వగానే, తను ఊహించని విధంగా ఇలా కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో బిత్తరి సత్తికి కరోనా సోకడంతో.. ఆయన బృందం మొత్తం ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లోకి చికిత్స చేయించుకోవడం కోసం ప్రైవేటు హాస్పిటల్ వైపు పరుగులు తీస్తుందని తాజా సమాచారం.

ఈమధ్యనే తన ఫన్నీ షో తో దిల్ ఖుష్ దివ్య, వార్తల వాణి అనే ఇద్దరమ్మాయిల్ని పరిచయం చేశాడు బిత్తరి సత్తి. ఇప్పుడు వాళ్లిద్దరూ కూడా హోమ్ క్వారంటైన్ లోకి వున్నారని తెలియడంతో ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈవిధంగా “గరం గరం వార్తల” బృందం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లిపోవడంతో.. సాక్షి ఛానెల్ కు ఆదిలోనే హంసపాదు ఎదురైందని చెప్పవచ్చు. ఇలాగే మరో 2 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని ఆపేస్తారా.. లేక మరో ట్రెండింగ్ టైటిల్ తోనైనా ఈ షోను నిర్వహిస్తారా.? అన్న విషయం ఇంకా తెలియ లేదు. విశేషమేమంటే.. ఈ “గరం గరం వార్తలు” షో ను ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణితో ప్రారంభం చేసాడు బిత్తరి సత్తి. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ క్రమంలో కోవిడ్ 19 వైరస్ విలయ తాండవం చేస్తున్న టైంలో.. మన బిత్తరి సత్తి క్వారంటైన్ నుండి బయటకు వచ్చేదాకా ప్రస్తుతం ఈ షో ను ఎవరితో నడిపిస్తారో వేచి చూడాలి.

మరోవైపు ఇటీవలే మాటీవిలో జరిగిన ఒక ప్రోగ్రాం కు బిత్తిరి సత్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యాంకర్ ప్రదీప్ తో సహా ప్రముఖ టీవీ నటీనటులు, సినీ నటులు హాజరయ్యారు. బిత్తిరి సత్తికి కరోనా సోకిన నేపధ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన వారంతా భయందోలనలకు గురవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here