“రాధే శ్యామ్”.. పాన్ ఇండియా మూవీ సాహో తరువాత యుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే మిగిలిన షూటింగ్ ను పూర్తీ చేసే పనిలో పడింది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రానికి భారీగానే ఖర్చు పెట్టారు నిర్మాతలు. పిరియాడిక్ లవ్ స్టొరీ కావడంతో ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే డిఫెరెంట్ గా కనిపించడం కోసం చాలా జాగ్రత్తలు వహించారు నిర్మాతలు. కేవలం ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం 6 కోట్లు ఖర్చు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమాకు చెందినా మరో విషయం బయటకి వచ్చింది.

ఇటీవలే విడుదలైన “రాధే శ్యామ్” గ్లింప్స్ లో కనిపించే ట్రైన్ సెట్ కోసం రూ.1.6 కోట్లు ఖర్చు చేసారట నిర్మాతలు. తొలుత ఈ సన్నివేశాన్ని ఇటలీలో చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావించిందట. అయితే కోవిడ్ నేపధ్యంలో ఇటలీ వెళ్ళడం సేఫ్ కాదని భావించిన నిర్మాతలు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ట్రైన్ సెట్ ను వేసారట. ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర అధ్వర్యంలో దాదాపు 250 మంది ఈ సెట్ కోసం శ్రమించారట. ఇటీవలే విడుదలైన ఈ గ్లింప్స్ 23 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. మరి సుమారు 5 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here