లాక్ డౌన్ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా రవాణా వ్యవస్థ స్తంభించింది. తాజాగా ప్రయాణికుల రైళ్లు ప్రారంభమయ్యే తేదీని రైల్వే శాఖ ప్రకటించింది. ఈనెల 12వ తేదీ నుంచి ప్రయాణికులకోసం ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు ఓక ప్రకటన జారీ చేసింది. అయితే దేశ రాజధాని ఢిల్లీ నుంచి దేశంలోని 15 రూట్లలో ఈ రైళ్లను నడపనున్నారు. మొత్తం 30 సర్వీసులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ.

న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, దిబ్రూగఢ్, అగర్తలా, రాంచీ, భువనేశ్వర్, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే ప్రకటించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.




























