లేటు వయస్సు హీరోయిన్స్ అందరూ పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకునే పనిలో పడ్డారు. నిన్న అనుష్క శెట్టి కూడా దుబాయ్ కి చెందినా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా ఒక వ్యాపారవేత్తతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దం అయిందని టాక్ వినిపిస్తోంది.

కోలీవుడ్, టాలీవుడ్ లతో పాటూ దక్షినాది సినీ రంగంలో అగ్రహీరోలు అందరి పక్కన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న త్రిష టాప్ హీరొయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఇది వరకే ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకున్న త్రిష కృష్ణన్ ఆ తరువాత ఏమయిందో తెలియదు కానీ , ఇద్దరూ విడిపోవడం, ఆ తరువాత పెళ్లి మాట పక్కన పెట్టి తన సినిమాలు చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే తాజాగా మరోసారి త్రిష పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం గతగోద్దికాలంగా త్రిష తన పెళ్లి గురించి తీవ్రంగా ఆలోచిస్తోందట. ఈ క్రమంలోనే ఒక వ్యాపారవేత్తతో పెళ్ళికి సిద్దమైందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఇరువురి కుటుంబాలు చర్చలు జరుపుకున్తున్నాయని. త్వరలో త్రిష పెళ్లి గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here