Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తన సినిమాల్లో భారీ పంచ్ డైలాగులు ఉండవు. గమ్మత్తుగా ఉండే అతడి డైలాగులు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. తెలుగు భాషలో ఉండే సొగసు అతడు రాసే మాటలకు ఇంకా అందంగా మారుతుంది. అలాంటి మాటలకు ప్రేక్షకులే కాదు సినిమా హీరోలు కూడా అభిమానులే. అందుకే ఆయనతో సినిమా చేయాలని ఎదురుచూస్తారు. త్రివిక్రమ్ తరుణ్ తో తీసిన నువ్వే నువ్వే సినిమా అప్పటికే ఆయనకు రచయితగా మంచి గుర్తింపు ఉంది. ఆయనతో సినిమాకు అగ్ర హీరోలు రెడీగా ఉన్నారు.
పవన్ నిద్రపోయాడు.. మహేష్ హిట్ కొట్టాడు….

ఇక అతడు సినిమా కథ మొదట పవన దగ్గరికి తీసుకెళ్లాడు. అయితే కథ చెప్పడం మొదలు పెట్టక పది నిమిషాలకే పవన్ నిద్రపోయాడు. అది చూసిన త్రివిక్రమ్ ఇక ఎం మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేసాడు. ఆ తరువాత మహేష్ కి వినిపించాలని వెళ్ళాడు త్రివిక్రమ్. ఇక కథ చెబుతూ ఉండగానే మహేష్ లేచి వెళ్ళిపోయాడు. దీంతో త్రివిక్రమ్ ఆలోచనలో పడ్డాడు. అసలు నాకు కథ చెప్పడం రాలేదా లేక కథ బాగోలేదా అని అర్థం కాలేదు. కాసేపయ్యాక వచ్చిన మహేష్ కథ అద్భుతంగా ఉందని నాన్నగారికి కూడా నచ్చిందని చెప్పారని పద్మాలయ బ్యానర్ తో సినిమా చేద్దామని ఉద్వేగంగా చెప్పారట.
రెండేళ్ల తరువాత మొదలు పెట్టి 175 రోజులకు సినిమా పూర్తి….

ఇక మహేష్ బాబు వరుసగా సినిమాలను చేస్తూ బిజీ అయ్యారు. ఇక త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా పూర్తి చేసుకుని మహేష్ కోసం ఎదురుచూశారు. అర్జున్ సినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ కి ఫోన్ చేసారు. అయితే సినిమా నిర్మాణం జయభేరి ప్రొడక్షన్ లో జరగాలని త్రివిక్రమ్ అడిగారు. నువ్వే నువ్వే సినిమా కంటే ముందే జయభేరి సంస్థ మురళీ మోహన్ గారు అడిగిన మొదటి సినిమా స్రవంతి రవి కిషోర్ కి చేస్తానని మాటిచ్చానని ఆ సినిమా తరువాత మీతో చేస్తానని చెప్పానని మహేష్ కి చెప్పడంతో జయభేరి ప్రొడక్షన్ లో సినిమా నిర్మాణానికి ఒప్పుకున్నారు. ఇక అప్పటికి మహేష్ అర్జున్ సినిమా పైరసీ ఇష్యూ లో కోర్ట్ కేసు లాంటి తలనొప్పుల మధ్య ఉన్నారు. ఇక అతడు సినిమా షూటింగ్ మొదలయింది. త్రివిక్రమ్ సినిమా టేకింగ్, స్క్రిప్ట్ నచ్చి మహేష్ రిలాక్స్ అయ్యారు. ఇక సినిమా కోసం ఇంటి సెట్ కూడా వేశారు భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటికి టీవీ లో వచ్చిన టీఆర్పి లో ఏ మాత్రం తగ్గడం లేదు. సినిమా లో ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేలా తీసిన త్రివిక్రమ్ కెరీర్ లో ఒక మైలు రాయిగా మిగిలిపోయింది. సినిమాలో మహేష్ త్రిష ల మధ్య ప్రేమ, నాజర్, మహేష్ ల మధ్య రిలేషన్స్, ప్రకాష్ రాజ్ సిబిఐ ఆఫీసర్ గా నటన, ఎమ్ఎస్ నారాయణ, సునీల్, బ్రహ్మానందం కామెడీ, మణి శర్మ సంగీతం అన్ని కలిసి సినిమాను హిట్ సినిమాగానే కాదు, ఒక మంచి క్లాసిక్ సినిమాగా ప్రేక్షకుల మదిలో నిలిపాయి.



























