మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటే అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగా అలరిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు, పాటలు ఇలా ప్రతీ అంశం అందరినీ బాగా ఆకట్టుకుంటాయి. హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో.. దానికి ఎదురుంటే విలన్ పాత్ర కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో భాషకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. విలన్ పాత్రకైనా సరే ఓ ప్రాంతీయ భాష నేపథ్యాన్ని తీసుకొని ఆ భాషా నేపథ్యంలో చాలా గమ్మత్తైన పదాలను పేర్చి ఆసక్తికరమైన డైలాగులను రాస్తారు.

దీనికి ఉదాహరణగా చెప్పాలంటే అత్తారింటికి దారేది సినిమాలోని కోట శ్రీనివాస రావు పాత్ర. ఆ పాత్ర నిడివి సినిమాలో ఉండేది చాలా తక్కువ సేపే. అయినా పాత్ర తాలూకా స్వభావం మాత్రం చాలా ప్రభావం చూపించింది. ఇక పాత్రలో కోట అద్భుతంగా నటించారు. కోట పాత్రకు త్రివిక్రమ్ రాసిన డైలాగులు చాలా బావుంటాయి. అన్నేళ్ళ అనుభవం ఉన్న కోటకు కూడా ఓ పదం ఏంటో అర్థం కాక దాని అర్థం ఆ పదాన్ని ఏ ప్రాంతం వారు వాడతారో తెలుసుకునే ఆసక్తి కలిగించింది. ‘నీ బిడ్డ ప్రేమంటే అంత గౌరవిత్తన్నావ్.. నా బిడ్డ పెళ్లంటే గుడ్డెద్దుకంత గౌరవం లేదీడికి.. దాని పెండ్లికొండిన పల్లావ్ వాసన పదూళ్ళకి తగలాలనుకున్యా.. ఇప్పుడీ గొడవ నూరూళ్ళకు తెలిసిందీ.. ఎంత బగిసాట్లూ’ అని ఓ ఫ్లోలో డైలాగులు రాశారు.

ఈ పాత్ర, డైలాగులకు మంచి పేరొచ్చింది. ఈ పాత్ర పోషించిన కోటకు మంచి పేరు వచ్చి అందరూ ప్రశంసించారు. చాలా మంది ఈ పాత్రలో నటించిన కోట గురించి గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఈ డైలాగులో ఉన్న ఎంత బగిచాట్లు అనే మాటకు అర్థం తెలీలేదన్నారు ఓ సందర్భంలో కోట. దీనిబట్టి అర్థమవుతుంది.. త్రివిక్రమ్ ప్రతీ విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో. అయితే, ఆయన సినిమాలలో ఒకే హీరోయిన్‌ను పదే పదే రిపీట్ చేస్తారని అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలలో హీరోయిన్ పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

Trivikram Srinivas :త్రివిక్రమ్ సెకండ్ లీడ్‌లో చేసే హీరోయిన్స్‌కు బలమైన పాత్రను రాయలేకపోతున్నారు
అయితే, ఆయన సినిమాలలో విలన్ పాత్రకు కూడా దక్కిన మంచి గుర్తింపు సెకండ్ లీడ్ రోల్ చేసే యంగ్ హీరోయిన్స్‌కు మాత్రం దక్కడం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ జల్సా సినిమాను రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఇందులో పార్వతీ మెల్టన్, కమిలినీ ముఖర్జీలు కీలక పాత్రలో కనిపించారు. పార్వతీని మంచి గ్లామర్ రోల్‌లో చూపించారు. ఓ సాంగ్ కూడా ఉంటుంది. కానీ, ఎందుకనో మళ్ళీ ఆమె కనిపించలేదు. ఆ పాత్రకు అంతగా పేరు దక్కలేదు. అలాగే అ.. ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించింది.

ఈ సినిమానే ఆమెకు తెలుగులో మొదటి సినిమా. ఇందులో సమంత, నితిన్ జంటగా నటించారు. సెకండ్ లీడ్ చేసిన అనుపమ ఇప్పుడు ఎవరికీ గుర్తు రాదు. అత్తారింటికి దారేది సినిమాలో కూడా ప్రణీత నటించిన సంగతి తెలిసిందే. పవన్‌తో మంచి డ్యూయట్ కూడా ఉంటుంది. కానీ ఆ సినిమాకు వచ్చిన పేరు ఎక్కువ శాతం సమంతకే. అజ్ఞాతవాసి సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా కీర్తి సురేశ్..సెకండ్ హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యూయేల్, అరవింద సమేత సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఈషా రెబ్బ సెకండ్ లీడ్‌లో, అల వైకుంఠపురములో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా నివేతా పేతురాజ్ కీలక పాత్రలో కనిపించారు. కానీ, ఈ సెకండ్ లీడ్ క్యారెక్టర్స్ చేసిన వారెవరు అంతగా పాపులర్ కాలేదు. ఎందుకనో త్రివిక్రమ్ సెకండ్ లీడ్‌లో చేసే హీరోయిన్స్‌కు కథలో అంత బలమైన పాత్రను రాయలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఈ కారణంగానే కొందరు ఆయన సినిమాలో సెకండ్ లీడ్ కోసం అడిగితే నో చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.































