Trivikram Rao : అన్నదమ్ములు చక్కగా కలిసి ఉంటే రామలక్ష్మణుల్లా ఉన్నారని అందరూ అంటారు. అలా ఇండస్ట్రీ లో అన్నదమ్ములు కలిసి పనిచేసుకుంటూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉన్నవాళ్లు చాలా మందే ఉన్నా అందరిలోనూ ఎన్టీఆర్ ఆయన తమ్ముడి బంధం మాత్రం చాలా చక్కగా ఉండేదని ఆరోజుల్లో చెప్పుకునేవారు. తమ్ముడికి అన్నయ్య ఎన్టీఆర్ అంటే గౌరవం, అటు తమ్ముడు మాట వినే తత్త్వం అన్నయ్యది, అలా ఇద్దరూ రామలక్ష్మణుల్లాగా మెలిగేవారు. అలాంటి ఇద్దరి మధ్య మనస్పర్తలు వచ్చి దూరమయ్యారు.

చిన్న పొరపాటు కే రామ రావు గారు తమ్ముడిని దూరం చేసుకున్నారు…
రామారావు గారు పాలు అమ్మి జీవనం సాగిస్తూ చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నారు. ఇక సినిమా ప్రయత్నాలు చేయడానికి మద్రాస్ వెళ్లాలని అనుకున్నపుడు కూడా తమ్ముడు త్రివిక్రమరావు నేను ఇంటి బాధ్యత తీసుకుంటాను నువ్వు సినిమా అవకాశాలకోసం మాద్రాస్ వెళ్ళు అని ప్రోత్సహించారు. ఇక సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాక సినిమాల విషయంలో త్రివిక్రమరావు బాగా సలహాలు ఇచ్చేవారట. ఇక ఎన్టీఆర్ గారి కొత్త సినిమా క్లాప్ కొట్టాలంటే తమ్ముడు ఉండాల్సిందే. సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూనే వేరే ప్రొడక్షన్ హౌస్ లో కూడా సినిమాలు చేయమని అన్నకు సూచించేవారట. ఇక కృష్ణ కుమారిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు చాకచక్యంగా కృష్ణ కుమారిని బెంగళూరు పంపేసి పెళ్లి మరుసటి రోజు ఉదయమనగా జరగకుండా ఆపేసారు. తన వదిన కు అన్యాయం జరగకూడదని అలా చేసారు. ఇక ఈవిషయంలో ఎన్టీఆర్ కూడా తమ్ముడిని ఏమి అనలేదు.

ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టాక అటు రాజకీయాల్లోను, ఇటు సినిమాల్లోను బిజీగా ఉన్నపుడు రెండింటిని బ్యాలన్స్ చేయడానికి ఆయనకు త్రివిక్రమ్ రావు గారు తోడు నిలిచారు. ఆయన తొమ్మిది నెలల్లో అధికారం లోకి రావడంలో త్రివిక్రమ రావు గారి కృషి ఎంతో ఉందని చెప్పుకుంటారు. ఇక అలాంటి వ్యక్తి ని ఎన్టీఆర్ గారు చిన్న పొరపాటు చేసాడని దూరం పెట్టారు. ఎన్టీఆర్ గారు చిన్నతప్పుని కూడా తన కుటుంబ సభ్యులు చేస్తే ఉపేక్షించే వారు కాదు. పార్టీ ఫండ్ కోసం త్రివిక్రమ రావు గారు ఇరవై వేలు వసూలు చేయడంతో తనకు చెప్పకుండా అలా డబ్బు వసూలు చేసినందుకు ఎన్టీఆర్ గారు చాలా మండిపడ్డారట. ఇక అప్పటి నుండి ఆయనను దూరం పెట్టారని, త్రివిక్రమ రావు గారి ఇద్దరు కుమారులు సినిమాల్లోకి వచ్చినా ఎన్టీఆర్ గారి సపోర్ట్ లేదని చెబుతారు. అయితే చివర్లో ఎన్టీఆర్ గారు తన తమ్ముడితో కలిశారని, మాట్లాడారని చెబుతుంటారు.



























