“అలా…” త్రివిక్రమ్ కాపీ కొట్టేసాడు… కేసుపెట్టిన ఎన్టీఆర్ రైటర్ !!

0
308

సంక్రాతి సందర్భంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషల్ లో వచ్చిన “అలా.. వైకుంఠపురములో…” చిత్రం. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. గీతా ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా షేర్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నాన్ బాహుబలి రికార్టులను అధిగమించింది. అయితే ఈ నేపథ్యంలో అసలు “అలా… వైకుంఠపురములో…” సినిమా తానందంటూ.. త్రివిక్రమ్ తన కథను కాపీ కొట్టాడంటూ ఒకతను త్రివిక్రమ్ మీద లీగల్ కేసు నమోదు చేసాడు.

“త్రివిక్రమ్ మోసగాడు.. 2005లో నేను త్రివిక్రమ్ కు వినిపించిన “అలా.. వైకుంఠపురములో.. ” కథను ఇప్పుడు సినిమా తీసి నన్ను మోసం చేసాడు అంటూ..” కేసు నమోదు చేసాడు.. కృష్ణ అనే దర్శకుడు.. గతంలో యుంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా సుబ్బు కు కథ రాసిన కృష్ణ ఇప్పుడు రైటర్స్ ప్రూఫ్స్ తో సహా షాకింగ్ కామెంట్లు చేసారు. 2013లో ఈ స్క్రిప్ట్ రిజిస్టర్ అయిందని. అయితే ఈ సినిమా తీయడం కోసం అన్ని రెడీ చేసుకున్న సమయంలో సేమ్ సినిమా వస్తుందని నేను సినిమా చేయబోయే నిర్మాతకి తెలియడంతో నా ప్రాజెక్ట్ పక్కకు పెట్టేసారు. తీరా సినిమా ఎవరు తీస్తున్నారా అని చుస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకు తాను “దశ దిశ” అని టైటిల్ పెట్టాలనుకున్నట్టు చెప్పుకొచ్చాడు కృష్ణ. త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు కూడా పంపిస్తానని చెబుతున్నాడు కృష్ణ.

అయితే దీనిపై త్రివిక్రమ్ అభిమానులు కృష్ణ పై మండి పడుతున్నారు. సినిమా విడుదలైన నెల రోజులకి ఈ కథ నీదని గుర్తొచ్చిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే త్రివిక్రమ్ కు ఇలాంటి ఆరోపణలు కొత్తేమీకాదు. గతంలో కూడా ఆయనపై ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. మరి ఇదీనిపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here