తను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఖడించారు. ఈ విషయంపై తెలంగాణ భవన్‌లో రాజయ్య మీడియాతో మాట్లాడారు. జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని తేల్చిచెప్పారు. లోటస్ పాండ్‌లో అనిల్ కుమార్‌ను కలిసినట్టు వస్తున్న వార్తలు వాస్తవం లేదన్నారు. 2019 సంవత్సరంలో ఒక క్రైస్తవ సమావేశం సందర్భంగా కలిసిన ఫోటో అది అని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ తనకు మంచి ప్రాధాన్యతను ఇచ్చారు. నాకు ఎంతో ఇష్టమైన వైద్యారోగ్య శాఖను అప్పజెప్పారు. నేను ఎలాంటి ప్రతిప్రదాన పెట్టకుండానే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఆయన వల్లే టీఆర్ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాను. పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష అని పేర్కొన్నారు. దళిత బంధు కార్యక్రమంతో దళితులు తలెత్తుకుని తిరిగే విధంగా సీఎం కేసీఆర్ చేశారన్నారు.


































