మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవలే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయన ఈరోజు ఉదయం బీజేపీలో చేరారు. ఈ నేపధ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి ఈటల రాజేందర్ పై కీలక వ్యాఖ్యలు చేసారు.

మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటల ఎక్కింది మునిగిపోయే నావా అంటూ ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని, అయితే ఈటల చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదన్నారు. అయితే ఆయన బీజేపీలో చేరి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసారని మండి పడ్డారు జగదీష్ రెడ్డి. హుజూరాబాద్ ప్రజలకు ఈటల ద్రోహం చేస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.





























