కరోనా సెకండ్ వేవ్ ఉదృతి పెరుగుతున్న నేపధ్యంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. కరోనా వచ్చి ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్న వారికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. నగరంలో భోజనం కావాల్సిన వారు రిజిస్టర్ మొబైల్ నుంచి 7799616163 నెంబర్ కు వాట్సాప్ చేయాలి.

ఈ క్రమంలో భాదితుల పేర్లు, ఫోన్ నంబర్, అడ్రెస్స్ మరియు ఇంట్లో రోగుల సంఖ్య వివరాలను అందించాలి. ఉదయం 6 గంటలకు ముందే మెసేజ్ చేయాలి. ఆ తరువాత పంపినవారికి మరుసటి రోజు ఆర్డర్ గా పరిగణిస్తారు. ఒకరు గరిష్టంగా రోజుకు 5 ఆర్డర్లు ఇవ్వోచ్చు.



























