ఐటి రైడ్స్ అంటే భయాడని వారు ఎవరుంటారు చెప్పండి… సాధారణ జనాలకు పెద్దగా తెలియదుగాని, సినిమా వాళ్ళు, రాజకీయ ప్రముఖులకు మాత్రం ఆ భయం ఎలా ఉంటుందో బాగానే తెలుసు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఘటన దీనికి ఉదాహరణ. తమిళ హీరో విజయ్, ఆఫీసులు, కార్యాలయంపై ఐటీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపుగా రూ.65 కోట్ల రూపాయలు దొరికాయి. ఈ డబ్బును ఐటి అధికారులు సీజ్ చేశారట.ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పరులువురు టాలీవుడ్ స్టార్ హీరోలు, సెలెబ్రెటీస్ పై కూడా ఐటి దాడులు జరుగుతాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ఇల్లు, ఆఫిసులలో ఐటి దాడులు జరగడం సాధారణ విషయమే అయినా కూడా కొంత మంది స్టార్ హీరోలు సైతం ఐటి దాడులు అంటే వణికిపోతున్నారట. ముఖ్యంగా ఆ ముగ్గురు స్టార్ హీరోలు పన్నులు చెల్లించలేదని, అందుకే భయపడుతున్నారన్న వార్త ఫిలింనగర్ లో జోరందుకుంది.

నిజమే ఆ ముగ్గురు స్టార్ హీరోలు భయం గుప్పెట్లో ఉన్నారట. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పై ఐటి దాడులు జరిగినప్పటినుంచి వీళ్ళ వంతు ఎక్కడ వస్తోందో అని భయం తో వణికిపోతున్నారట. ఒకరు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుంటే, మరొకరు సినిమాలతో పాటు, బిజినెస్ ని కూడా యమా స్పీడు మీద నడుపుతున్నాడు. ఇంకా మూడవ హీరో తండ్రి కష్టాలు చెప్పుకుంటూ.. ఒక పక్క సూపర్ హిట్లు కొట్టుకుంటూ పెళ్ళాం, పిల్లలతో అందమైన జీవితాన్ని గడుపుతున్నాడు. వీరంతా బాగా ఉన్నవాళ్లే అయినా టాక్సులు కట్టకపోవడంతో వెన్నులో వణుకు పుడుతుందట. ఓక హీరో సుమారు 100 కోట్లు టాక్స్ ఎగ్గొట్టేసాడట. మరో హీరో సినిమా పుట్టినప్పటి నుంచి ఉన్న ఫ్యామిలీనే, అద్భుతమైన చరిత్ర ఉన్న వారసుడి అయినా కానీ భయం గుప్పెట్లో బతుకున్నాడట. ఎన్ని స్టూడియోలు ఉన్నా.. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే టాక్స్ అయితే కట్టాలి కదా. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ఇల్లు, ఆఫిసులలో ఐటి దాడులు జరగడం సాధారణ విషయమే అయినా కూడా కొంత మంది స్టార్ హీరోలు సైతం ఐటి దాడులు అంటే వణికిపోతున్నారట. ముఖ్యంగా పన్నులు చెల్లించని ఆ ముగ్గురు స్టార్ హీరోలు మాత్రం భయపడుతున్నారన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొట్టుడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here