మనసు మమత, మౌనరాగం ఫేమ్ శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల దర్యాప్తులో దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డి, అశోక్ లపై కేసులు నమోదైనా మరో కోణంలో నుండి ఆలోచిస్తే శ్రావణి తప్పే ఎక్కువగా కనబడుతోంది. జీవితంలో మెచ్యూరిటీ లేకుండా శ్రావణి తీసుకున్న నిర్ణయాలే ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులను సృష్టించాలని సులభంగానే అర్థమవుతోంది.

మొదట శ్రావణికి సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. అతనితో శ్రావణి ప్రేమాయణం సాగించింది. ఆ తరువాత సాయికృష్ణారెడ్డి వల్ల సినీ నిర్మాత అశోక్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. అశోక్ రెడ్డితో కూడా శ్రావణి సన్నిహితంగా మెలిగినట్లు ప్రచారం జరిగింది. అయితే టిక్ టాక్ యాప్ ను ఎక్కువగా ఇష్టపడే శ్రావణికి అందులో చేసిన వీడియోల ద్వారా తమ జిల్లాకే చెందిన దేవరాజ్ రెడ్డితో పరిచయం ఏర్పడింది.

ప్లే బాయ్ అయిన దేవరాజ్ రెడ్డి శ్రావణిని తన మాటలతో నమ్మించి ప్రేమలో పడేలా చేశాడు. ఆమె సహకారంతో సీరియళ్లలో అవకాశాలను సంపాదించాడు. దేవరాజ్ కు పంటి సమస్య ఉండటం వల్ల మొదట్లో అవకాశాలు రాకపోతే శ్రావణి పదివేలకు పైగా ఖర్చు చేసి అవకాశాలు వచ్చేలా చేసింది. అయితే శ్రావణి దేవరాజ్ తో సన్నిహితంగా మెలగడం సాయికి నచ్చలేదు. దీంతో పలుమార్లు సాయి, దేవరాజ్ మధ్య వాగ్వాదాలు సైతం చోటు చేసుకున్నాయి.

శ్రావణి తల్లిదండ్రులకు కూడా దేవరాజ్ తీరు నచ్చకపోవడంతో అతనితో పెళ్లికి అంగీకరించలేదు. చివరకు శ్రావణి దేవరాజ్ నే పెళ్లి చేసుకుందామని అనుకున్నా అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పడంతో మానసికంగా ఒత్తిడికి గురై శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. కెరీర్ విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం, తప్పు నిర్ణయాలు తీసుకోవడం శ్రావణి మృతికి కారణమయ్యాయని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here