ఒకప్పుడు బాల నటీనటులుగా ఉన్న ఎంతోమంది భవిష్యత్తులో హీరో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారున్నారు. అలాగే సినీ పరిశ్రమ కాకుండా మరో రంగం లోకి వెళ్లి అక్కడ మంచి స్థానంలో ఉండడం జరిగింది. 1970 ప్రథమార్థంలో శ్రీదేవి బాలనటిగా మా నాన్న నిర్దోషి, భార్య బిడ్డలు, నేను మనిషిని, భక్తతుకారం, బాల భారతం, బడిపంతులు లాంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 1978 లో పదహారేళ్ళ వయసు సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా కార్తీకదీపం, వేటగాడు, బొబ్బిలి పులి లాంటి అనేక చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.

1980 దశకం అర్ధ భాగంలో రాశి.. మమతల కోవెల, రావుగారిల్లు, బాలగోపాలుడు లాంటి సినిమాల్లో బాలనటిగా నటించి.. ఆ తర్వాత శుభాకాంక్షలు, సుస్వాగతం, ప్రేయసి రావే లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1980లో వచ్చిన శంకరాభరణం చిత్రంలో వరలక్ష్మి, తులసి బాల నటీమణులు గా కనిపించారు. తర్వాతి కాలంలో వారిద్దరూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్స్ గా కనిపించారు.

ఇలాంటి కోవలోకి వచ్చిన నటి సుజిత. కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన.. అన్నయ్య సూర్య కిరణ్ (సత్యం సినిమా దర్శకుడు) సహకారంతో అనేక సినిమాల్లో బాలనటిగా నటించింది. హిందీలో అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి అదేవిధంగా తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ తెలుగులో చిరంజీవితో పసివాడి ప్రాణంలో బాలనటిగా కనిపించింది. ఇదే కథతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో వచ్చిన ఐదు సినిమాల్లో బాలనటిగా కనిపించిన రికార్డు సుజిత కే దక్కుతుంది.

తర్వాత జై చిరంజీవ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటించి అనేక తెలుగు చిత్రాలతో పాటు తమిళ మలయాళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించారు. ఆ తర్వాత బుల్లితెరలో అనేక సీరియల్స్ చేస్తూ వదినమ్మ సీరియల్లో ప్రభాకర్ కు జోడిగా సీత పాత్రలో తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తున్నారు.

































