టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి లేటెస్టుగా నిర్మిస్తున్న ‘R.R.R’ చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఅర్ నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతేకాకుండా.. ఇన్నేళ్ళ తన సినిమా కెరీర్‌లో కేవలం సినిమాలలోనే కాకుండా..

బుల్లితెరపై సంచలనం సృష్టించిన ‘బిగ్‌బాస్’ వంటి రియాలిటీ షోలో కూడా హోస్ట్‌గా ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించాడు. ఆ షో ముగిసిన తర్వాత మళ్ళీ సినిమా ఆఫర్లతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ హీరోగా 30 సినిమాలకు చేరువైన జూనియర్ ఎన్టీఅర్ బుల్లితెరపై ఒక్క బిగ్‌బాస్ షోలోనే కాకుండా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే ఓ సీరియల్ లో నటించాడన్న విషయం చాలా ఫ్యాన్స్ కి తెలియదు. ఇంతకీ ఆ సీరియల్ ఏమిటనే కదా.. మీ సందేహం.? అయితే ఆ వివరాలను ఇప్పుడే చదివి తెలుసుకోండి. చిన్నప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’ చిత్రంలో మన జూనియర్ ఎన్టీఆర్ బాల రాముని పాత్రలో మెప్పించిన సంగతి అందరికీ తెలుసు. ఆ చిత్రం తర్వాత మళ్లీ చదువులో పడిపోయిన జూనియర్ ఎన్టీఅర్ 2001లో వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్ను చూడాలని” చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఆ చిత్రానికన్నా ముందు మన తారక్ ఓ టీవీ సిరీయల్ లో నటించాడు. ఆ సీరియల్ పేరు ‘భక్త మార్కండేయ’. ఈ సీరియల్ లో జూనియర్ ఎన్టీఅర్ భక్త మార్కండేయుని పాత్రలో నటించాడు. ఈ సీరియల్ అప్పట్లో ఈటీవీ లో ప్రసారమైంది. ఆ సీరియల్ తర్వాతే జూనియర్ ఎన్టీఅర్ హీరోగా తన విశ్వరూపాన్ని చూపించాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఅర్ రాజమౌళి దర్శకత్వంలో 4వసారి ‘R.R.R’ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రం, K.G.F డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో చిత్రం.. అలాగే తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించడానికి ఓకే చెప్పాడని తాజా సమాచారం.



























