షోకి హీరోయిన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఈ స్టార్ యాంకర్లకు ఇప్పుడు ఎంత కష్టమొచ్చింది…

0
198

కరోనా తెచ్చిన కష్టాలు అందరిని బాగానే పీడిస్తున్నాయి. ఎవరిని వదలడంలేదు.. సుమారు అన్ని రంగాలు ఈ కరోనా దెబ్బకు అబ్బా అంటున్నవారే.. అయితే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది సినిమా ఇండస్ట్రీ. అవును సినిమా ఇండస్ట్రీ కరోనా దెబ్బకు కుదేలవుతోంది. కరోనా నేపథ్యంలో థియేటర్స్‌ బంద్. షూటింగ్స్ బంద్. ఇపుడిపుడే లాక్ డౌన్ లో కాస్త వెసులుబాటు కల్పించడంతో మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే కొన్ని చానెల్స్ లో డైలీ సీరియల్స్‌ స్టార్ట్ అయ్యాయి. జబర్ధస్త్ వంటి రియాలటీ షోస్ షూటింగ్స్ మొదలుపెట్టారు.

దాదాపు మూడు నెలలు తరువాత టీవీ ఆర్టిస్టులు, యాంకర్లు ఇపుడు కాస్త బిజీ అయ్యారు. అయితే తెలుగులో టాప్ యాంకర్స్ సుమ, అనసూయ, రష్మీ వంటి యాంకర్లు నిన్నమొన్నటి వరకు ఒక హీరోయిన్ కంటే ఎక్కువగా వసూలు చేసేవారు. ఒక్క షో కి భారీగా ఉండేది వీరి సంపాదన.

అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ యాంకర్లు పారితోషకాన్ని సగానికి తగ్గించినట్టు సమాచారం. ప్రస్తుతం సగం పేమెంట్ తోనే వీరు షో చేస్తున్నారు. కరోనా పారిస్తుతుల నుంచి బయటపడిన తర్వాత వీరికి యదావిధిగా పేమెంట్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. వీరితోపాటు శ్రీముఖి, మంజూషలది పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.. ఆ ఫుల్ పేమెంట్ కూడా భవిష్యత్తులో వీరు చేసే ప్రోగ్రామ్స్‌ యొక్క టీఆర్పీ రేటింగ్ పెరిగితేనే ఇస్తామంటూ కండిషన్స్ పెట్టినట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here