పెళ్లి జరిగిన తర్వాత భార్య భర్తల మధ్య అన్యోన్యత, శారీరిక సంబంధం పెరగడం సాధారణం. కానీ ఓ జంటకు పెళ్లి జరిగి రెండు నెలలు గడిచినప్పటికీ భర్త తన భార్యతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోలేక పోయాడు. ఈ క్రమంలోనే తన భార్యపై భర్తకు పలు అనుమానాలు తలెత్తడంతో ఆమెకు వైద్య పరీక్షలు చేయించాడు. అయితే వైద్య పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత తన భార్య అసలు మహిళ కాదని తెలుసుకున్న భర్త ఖంగుతిన్న ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో ఒక హిజ్రా కు లింగమార్పిడి చేసి అమ్మాయి అని చెప్పి మోసం చేసి కాన్పూర్ నగర్ కి చెందిన యువకుడికి శాస్త్రినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతికి ఏప్రిల్ 28వతేదీన వివాహం చేశారు. వీరి వివాహం తర్వాత వరుడు వధువుతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోలేక పోయాడు. ఈ క్రమంలోనే తన భార్య లింగ మార్పిడి చేయించుకోవడం వల్లే తన జననాంగాలు పూర్తిగా వృద్ధి చెందడం లేదని గుర్తించిన ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడంతో అసలు ఆమె మహిళ కాదని తన ట్రాన్స్ జెండర్ అని తెలియడంతో భర్త కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.తను మహిళ కాదని తెలిసినప్పటికీ మోసం చేసి తన కిచ్చి పెళ్లి చేశారని భర్త అత్తమామల పై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అదేవిధంగా తన భార్య, అత్తమామలు, పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.































