నటుడు ఉదయ్ కిరణ్ మరణం పై అతడి సోదరి శ్రీదేవి అనుమానాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆమె ఉదయ్ కిరణ్ మరణం గురించి ప్రస్తావించారు. ఉదయ్ కిరణ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని తన తమ్ముడు కోటీశ్వరుడు అని చెప్పడం ఇపుడు మళ్లీ అనుమానాలకు తావిస్తుంది. “మా అమ్మ చనిపోయేపుడు నాకు, మా తమ్ముడికి చాలా ఆస్తి ఇచ్చిందని నా తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులూ ఏమి లేవని..” చెప్పడం జరిగింది.

ఉదయ్ కిరణ్ కి తన తల్లి నుండి భారీ ఆస్తి వచ్చిందని వాటి విలువ కోట్లలో ఉంటుందని, అంతేకాకుండా మా అమ్మ 4 కిలోల బంగారం, 1 కేజీ వెండి, అత్యంత ఖరీదైన ప్రాంతాలలో మూడు విలువైన ఆస్తులు ఇచ్చింది అని ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉదయ్ కిరణ్ చనిపోయాక అతని ఆస్తి మొత్తం భార్యకే చెందుతుంది కాబట్టి ఉదయ్ కిరణ్ భార్య వితిక తీసుకోవడం జరిగింది. ఉదయ్ కిరణ్ చనిపోయాక అతని భార్య ఉదయ్ కిరణ్ తరుపు బంధువులతో ఎటువంటి సంప్రదింపుల లేకుండా ఆస్తినీ తీసుకోవడం, ఉదయ్ తరుపు బంధువులను దూరం పెట్టడం వంటివి అనుమానాలకు తావిస్తుంది. “మా కుటుంబంతో కలవడానికి కూడా ప్రయత్నించడం లేదు, మేము ప్రయత్నించిన కలవడం లేదని, ఏదో ఒక కారణం చెప్పి కలవడం లేదని..”, వితిక ప్రవర్తన తో ఉదయ్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉదయ్ కిరణ్ సోదరి మస్కట్ లో నివసిస్తూ ఉంటారు. ఆవిడ ఉదయ్ మరణంపై మొదటి నుండి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయ్ ది ఆత్మహత్య అని కొట్టిపారేస్తున్నారు అని శ్రీదేవి చెబుతున్నారు. మా తమ్ముడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదు అని, ఆర్ధిక పరమైన కారణాలతో ఆత్మహత్య చేసుకోవాల్సిన ఖర్మ నా తమ్ముడికి అసలు ఎప్పటికీ రాదు అని, సినిమాలు లేకపోయినా న తమ్ముడు కోటీశ్వరుడు అంటూ ఆమె తన బాధను మరోసారి వ్యక్తం చేశారు.




























