Ukraine President: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం పై దృష్టిసారించారు. రష్యా తన సైనిక బలంతో ఉక్రెయిన్ దాడి చేయడంతో ఒక్కసారిగా ఉక్రెయిన్ లో భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రష్యాపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఒక్కసారిగా పాపులర్ కావడంతో చాలా మంది ఆయన ఎవరు ఇలా రాజకీయాలలో ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏమిటి అనే విషయాల గురించి పెద్దఎత్తున చర్చలు జరుపుతున్నారు.

ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వ్యక్తిగత విషయానికొస్తే ఈయన 1978 లో జనవరి 25న అప్పటి సోవియట్ యూనియన్ లో భాగమైన ఉక్రెయిన్ లోని క్రివ్యిరిహ్ ఒలెక్సాండర్ సెమెనోవిచ్ జెలన్ స్కీ, రైమా జెలెన్ స్కీ. జెలెన్ స్కీ దంపతులకు జన్మించారు. జెలెన్ స్కీ తన క్రివ్యిరిహ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువు పూర్తి చేసి లాయర్ పట్టా అందుకున్నారు. అయితే ఎప్పుడు ఈయన లాయర్ గా తన వృత్తి కొనసాగించలేదు.
జెలెన్ స్కీ కి చదువుతున్న రోజుల్లోనే నటనపై ఆసక్తి ఉండటం వల్ల ఈయన మొదటగా ఒక కమెడియన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన వెబ్ సిరీస్ లో హీరోగా నటించారు.కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జెలెన్ స్కీ బాగా పాపులారిటీ దక్కించుకున్నారు.

మార్చి 2018 లో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అనే సిరీస్ లో నటించారు ఈ సిరీస్ నేమ్ తో జెలెన్ స్కీ తన పొలిటికల్ పార్టీ నిర్వహించే ఆ పార్టీ ద్వారా తాను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా అధిక మెజార్టీతో గెలిచిన జెలెన్ స్కీ, 2014 లో రష్యా ఉక్రెయిన్ ల మధ్య డాన్ బాస్ భూభాగం కోసం జరిగిన యుద్ధంలో భాగంగా ఆర్మీ కోసం ఏకంగా పాతిక లక్షల విరాళం ప్రకటించారు. అప్పటి నుంచి దేశభక్తి పెరగడంతో రాజకీయాల్లోకి రావాలని భావించారు.
నటన నుంచి రాజకీయ నాయకుడిగా..
ఈ విధంగా రాజకీయాలలోకి వచ్చిన ఈయన 2019 లో జెలెన్ స్కీకి 73.2 శాతం ఓట్లు రావడంతో 2019 మే 20న ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఉక్రెయిన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక ఈయన 2003లో ఒలెనా కియాశ్కో అనే స్క్రీన్ రైటర్ ను వివాహంచేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఇలా నటుడిగా కొనసాగిన ఈయన రాజకీయ నాయకుడిగా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారు.