Uma Maheshwari : నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది ఎన్టీఆర్ గారి చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే నందమూరి కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె భౌతిక ఖాయానికి చివరిసారిగా చూసుకోడానికి ఆమె ఇంటికి బయలుదేరారు. నందమూరి కుటుంబం ఇటు రాజకీయంగా, సినిమా పరిశ్రమలో పేరున్న కుటుంబం. అన్న ఎన్టీఆర్ కు ఎనిమిది మంది కుమారులు, నలుగురు కూతుర్లు. అయితే అందరూ బాగా స్థిరపడి అటు రాజకీయారంగంలో కొంతమంది ఉంటే మరికొంతమంది వ్యాపార రంగంలో ఉన్నారు.

పెళ్లయ్యాక భర్త వేధింపులు…
ఎన్టీఆర్ గారి కూతుర్లలో పెద్ద కూతురు గారపాటి అన్నపూర్ణేశ్వరి గైనకాలాజిస్ట్ గా స్థిరపడ్డారు. ఇక రెండో కూతురు దగ్గుబాటి పురందరేశ్వరి రాజకీయాల్లో ఉన్నారు. ఇక మూడో కూతురు భువనేశ్వరి హెరిటేజ్ సంస్థ చూసుకుంటున్నారు, ఇలా ముగ్గురు కూతుర్లు చక్కగా స్థిరపడ్డారు. అయితే నాలుగో కూతురు ఉమామహేశ్వరీ ని నరేంద్ర రాజన్ అనే వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేసారు రామరావు గారు. పెళ్లయ్యాక అమెరికాలో కొంత కాలం ఉన్న ఉమా మహేశ్వరి భర్త పెట్టే వేధింపులను భరించలేక పోయింది. సిగరెట్లతో కాల్చడం, మాసికంగా, శరీరకంగా వేదించడం చేయడంతో శాడిస్టు భర్త గురించి ఇంట్లో వాళ్లకు చెప్పడంతో రామారావు గారు బాధపడి విడాకులు ఇప్పించి రెండో పెళ్లి చేసారు.

కంఠమనేని శ్రీనివాస రావు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న ఉమా మహేశ్వరి గారి జీవితం ప్రశాంతంగానే సాగింది. ఇటీవలే కూతురికి ఘనంగా నిశ్చితార్థం కూడా జరిపించిన ఆమె ఇలా ఆత్మహత్యకు పాల్పడటం అందరికి ఆశ్చర్యానికి గురిచేసింది. అనారోగ్య సమస్యలు, మానసిక వత్తిడితోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ గారికి చిన్న కూతురు ఉమా మహేశ్వరి అంటే చాలా ఇష్టమట. ఇటీవలే కూతురు ఎంగేజ్మెంట్ లో కుటుంబ సభ్యులు అందరితో కలిసి సంతోషంగా గడిపిన ఉమా మహేశ్వరి గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరం.



































