Uma Maheswari : నందమూరి ఇంట విషాదం అలుముకుంది. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ విషయం నందమూరి వాళ్లనే కాదు మొత్తం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆత్మహత్య చేసుకునేంత బద్దలు ఇబ్బందులు ఏమున్నాయనే ఆరాలు మొదలయ్యాయి. ఇక ఉమా మహేశ్వరి గారి జీవితం గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు అందరూ. అయితే చనిపోక ముందు చివరి గడియలలో జరిగిన విషయాలు అత్యంత కీలకంగా ఉన్నాయి.

ఆ నాలుగు గంటలు ఏం జరిగింది…
ఉమా మహేశ్వరి గారి జీవితంలో మొదటి పెళ్లి ఒక పీడ కల. భర్త వేధింపులను కొంత కాలం భరించిన ఉమా మహేశ్వరి మానసికంగా, శారీరకంగా పడిన హింసను భరించలేక తోబుట్టువులకు చెప్పుకుంది. రామారావు గారికి చిన్న కూతురంటే ఎక్కువ ప్రేమ, ఇక ఆమె పడుతోన్న బాధలను చూసి ఆయన చాలా బాధపడ్డారట. ఇక మొదటి భర్తతో విడాకులు ఇప్పించి రెండో పెళ్లి చేసారు. ఇక అప్పటి నుండి ప్రశాంతంగానే జీవిస్తున్న ఉమా మహేశ్వరి జీవితంలో ఇంకా ఏం బాధలను మోస్తున్నారో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఇక ఆమె ఆత్మహత్య కు ముందు జరిగిన పరిణామాలు కీలకంగా ఉండనున్నాయి. ఇటీవలే ఉమా మహేశ్వరి గారు కూతురు పెళ్లి ఘనంగా కుటుంబ సభ్యుల మధ్య చేసారు. కూతురు దీక్షిత అల్లుడు నిన్న ఉదయం జూబ్లీహిల్స్ లో ఉన్న ఉమ మహేశ్వరి ఇంటికి వచ్చి ఆమెతో సరదాగా కాసేపు మాట్లాడారు. ఆ తరువాత ఉమ మహేశ్వరి పది గంటల సమయంలో తలుపులు వేసుకుని గదిలో ఉన్నారు. చాలాసేపైనా ఇంకా గది నుండి బయటకు రాకపోవడంతో కూతురు అల్లుడు తలుపు కొట్టి పిలిచారు. ఇక ఎంతకీ స్పందించక పోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే చున్నీ తో ఉరి వేసుకుని ఉమ మహేశ్వరి ప్రాణాలను విడిచారు.

వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పగా ఇరవై నిమిషాలలో పోలీసులు అక్కడికి చేసుకున్నారు. ఇక వెంటనే కూతురు అన్న నారా లోకేష్ కి ఫోన్ చేసి విషయం తెలుపగా, జూబ్లీహిల్స్ లో ఉమ మహేశ్వరి ఇంటికి దగ్గరగా లోకేష్ ఇల్లు ఉండటం వల్ల నిమిషాల్లో అక్కడికి వచ్చి మిగతా విషయాలు చూసుకున్నారు. ఇక లోకేష్ వచ్చే లోపు పెదనాన్న చంద్రబాబు నాయుడుకి, ఇంకా తండ్రి తరుపు బంధువులకు ఫోన్ చేసి విషయం తెలియజేసిందట కూతురు దీక్షిత. మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలోనే పోలీసులు ఇంటివద్దకు చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉదయం కూతురితో బాగా మాట్లాడిన ఉమ మహేశ్వరి ఇలా చనిపోవాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియాల్సి ఉంది.



























