Undavalli Sridevi Husband Srinivas : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నది ఉండవల్లి శ్రీదేవి సస్పెన్షన్ గురించి. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు ఆమె పాల్పడినట్లు వైసీపీ అధినేతకు అనుమానం రావడంతో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసారు. ఇక ఆమె గురించి వైసీపీ చోటా మోట నాయకుల నుండి పార్టీ నేతలు ఉండవల్లి శ్రీదేవిని బాగా విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దారుణంగా వైసీపీ సానుభూతి పరుల కామెంట్స్ ఉంటున్నాయి. ఇక ఈ ఇష్యూ మీద శ్రీదేవి గారి భర్త డాక్టర్ శ్రీధర్ గారు స్పందించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు మహిళ అని కూడా లేకుండా బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు.

నా భార్య ను రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు….
ఉండవల్లి శ్రీదేవి గారు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణల మీద వైసీపీ పార్టీ ఆమెను సస్పెండ్ చెయడంతో ఆమె కుటుంబం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆమె క్రాస్ ఓటింగ్ కి పాల్పడలేదని 15 కోట్లు తీసుకుని క్రాస్ వీటింగ్ టీడీపీ కి అనుకూలంగా ఓటు వేసిందనేది అవాస్తవం అంటూ ఆమె భర్త డాక్టర్ శ్రీధరగారు మాట్లాడారు. రాజకీయాలే మాకు జీవితం కాదు మేము బాగా స్థిరపడిన కుటుంబం అందునా డాక్టర్స్ కావడం వల్ల పని కూడా ఉంది కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఇలా బురద జల్లుతారని అనుకోలేదు. వైసీపీ నుండి బయటికి వెళ్లి పార్టీ మీద విమర్శలు చేసిన కోటంరెడ్డి వంటి వారిని ఏం చేయలేక పోయిన వైసీపీ వాళ్ళు మేము పార్టీకి అనుకూలంగానే ఉన్న కూడా మా మీద బురదజల్లి బయటకు నెట్టేసారు.

మహిళ అనే గౌరవం కూడా లేకుండా వైసీపీ కి చెందిన వాళ్ళు ఫోన్లు చేసి చాలా నీచంగా మాట్లాడుతున్నారు అంటూ శ్రీనివాస్ గారు తెలిపారు. నా భార్యను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. సామూహికంగా రేప్ చేస్తామంటూ నీచంగా ఒక మహిళను అనకూడని మాటలు అంటున్నారు అని శ్రీనివాస్ గారు ఆరోపించారు. శ్రీదేవి ఇప్పటికీ చాలా బాధపడుతోందని తాను తప్పు చేయక పోయిన కూడా పార్టీ తన మీద నింద మోపి బయటికి పంపింది అంటూ ఆరోపించారు.





























