ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చేస్తున్న అరాచకాలు అంతా ఇంతా కాదు. కానీ అంతకంటే ఎక్కువగా మన పక్కనే ఉన్న పాకిస్థాన్ లో ఈ సంఘటనలు చూస్తే మీకే అర్థం అవుతుంది. అక్కడ ఓ ఏరియాలో ఎడ్ల బండి లాంటి ఓ రిక్షాలో… ఇద్దరు అమ్మాయిలు… ఓ చిన్నారి కూర్చొని వెళ్తున్నారు. అప్పుడు రాత్రి సమయం అయింది. అయినా అక్కడ ప్రజలు బాగానే ఉన్నారు కాబట్టి తమకు ఏమి కాదని ఆ అమ్మాయిలు అనుకొని ఉంటారు.

వెంటనే పరుగున వచ్చి ఓ వ్యక్తి అక్కడ రిక్షాలో ఎక్కాడు. బల్లిలా అతుక్కుపోయి.. ఓ అమ్మాయి బుగ్గపై ముద్దు పెట్టేశాడు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి కిందకు దూకి పారిపోయాడు. రెప్పపాటులో జరిగిన ఈ ఘటన బాధితురాలిని, పక్కనే కూర్చున్న మరో యువతి మాత్రం ఆశ్చర్యపోయారు. ఇంతదారుణామా అనుకున్నారు. ఇలా జరిగిన వెంటనే మరొకరు కూడా పక్కనే ఉన్న మరో యువతి దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించగా.. ఆమె చెప్పు తీయడంతో దుండగులు పారిపోయారు.
ఇదంతా ఓ యువకుడు వీడియో తీయగా.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ముద్దు పెట్టే ముందు ఆ యువకుడు అసభ్య సంకేతాలు చేశాడని.. దీంతో వారు తలలు తిప్పుకొని ఉన్నారని తెలిసింది. వారు వేరే వైపు తిప్పుకున్నప్పుడే ఆ యువకుడు రిక్షా దగ్గరకు వెళ్లి అంత పని చేశాడు. ఇదంతా పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 14 న జరగడం విశేషం. ఇటీవల మరో దారుణ ఘటన కూడా చోటు చేసుకుంది. గుంపులో ఓ మహిళ బట్టలు విప్పి.. గాల్లో విసిరేసి రేప్ చేయబోయారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దర్యాప్తుకు ఆదేశించారు.
#Video
— Lt.Gan Asif Ghufoor.???????? (@Naanofficial2) August 21, 2021
After Minar e Pakistan
One more disgusting incident from #Pakistan…
2 ladies r being Molested on road & a Guy jumped on the girl & force kissed …eeerrrr
THIS IS NAYA PAKISTAN ???????????? pic.twitter.com/Uxw5UP6ROu
ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఇది చూసి పాకిస్థాన్ ప్రభుత్వంపై భగ్గు మంటున్నారు. అక్కడ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందని పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లకూ… పాకిస్థాన్‌లో పరిస్థితులకూ ఎలాంటి తేడా లేకుండా పోయిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పాకిస్థాన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. లా అండ్ ఆర్డర్ విషయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ది మొదటి నుంచి మెతకవైఖరే అంటూ నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
































