Upasana: మెగా వారసుడు రామ్ చరణ్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భంతో ఉంది. రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు గతేడాది డిసెంబర్ లో ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మెగా వారసుడు ఎప్పుడెప్పుడు ఈ లోకంలోకి వస్తాడా అని మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఉపాసన బేబీ షవర్ వేడుకలు చిరంజీవి నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో కుటుంబసభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇక ఇటీవల జరిగిన ఉపాసన బేబీ షవర్ వేడుకలలో అల్లు అర్జున్ సందడి చేశాడు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ శుభాకాంక్షలు కూడా చెప్పలేదని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ఒక్క ఫోటోతో అల్లు, మెగా కుటుంబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం అయ్యింది.
ఉపాసన బేబీ షవర్ వేడుకలలో పాల్గొన్న అల్లు అర్జున్ ఉపాసనతో కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉంటే..శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ పనులతో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…