టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన పుట్టింట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు (92) నిన్న అనగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే వయస్సు పైబడడంతో పాటు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన తుదిశ్వాస విడిచారు.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని దోమకొండలో జన్మించిన కామినేని ఉమాపతి రావు ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేశారు. అంతేకాదు అయన తోలి టీటీడీ ఈవోగా పనిచేశారని అన్నారు. అయన గొప్ప విలువలు, నిస్వార్ధం, మానవతామూర్తి అని ఆమె తెలిపారు. అయన మృతి పట్ల ఉపాసన భావోద్వేగానికి గురైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో ఆమె తాతయ్యకు నివాళులు నివాళులు అర్పిస్తూ భావోద్వేగ ట్వీట్ చేసింది. ఇక ఉపాసన అపోలో హాస్పిటల్స్ లో తన దైన పాత్ర పోషిస్తూ… సామాజిక కార్యక్రమాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొంటున్నారు.
our thatha, K.Umapathy Rao of Domakonda-IAS 15June 1928-27May 2020 was a man of great principles, selflessness, generosity & sense of humor. An Urdu Poet know for his Shayari & the first EO of TTD was a strong believer in the religion of kindness & generosity.#RestinPeace ???????? pic.twitter.com/hb4iLgDGwj
— Upasana Konidela (@upasanakonidela) May 27, 2020




























