Upasana: తమన్నాకు ఖరీదైన డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చిన ఉపాసన… ఎందుకో తెలుసా?

0
47

Upasana: టాలీవుడ్ మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి నటి తమన్నా భాటియా తాజాగా నటించిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 చిత్రాల్లో విడుదలై మంచి విజయం సాధించాయి. ఇలా ఈ వెబ్ సిరీస్ లద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తమన్నా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ సిరీస్లలో కాస్త బోల్డ్ సన్నివేశాలలో ఈమె నటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇక ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలోనే ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో పడటంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అయితే తమ ప్రేమ నిజమేనని ఇద్దరం ప్రేమలో ఉన్నామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే తాజాగా ఈమె ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రాన్నిnధరించి మరోసారి వార్తల్లోకి వచ్చారు. తాజాగా ఈమె ఈ వజ్రపు ఉంగరాన్ని ధరించినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ వజ్రపు ఉంగరం తనకు ఉపాసన కానుకగా ఇచ్చారనీ గతంలో కూడా వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే మెగా కోడలు ఉపాసన ఇంత ఖరీదైన విలువైన వజ్రాన్ని తమన్నకు కానుకగా ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది. తమన్నాకు ఉపాసన ఈ వజ్రాన్ని ఎందుకు కానుకగా ఇచ్చారు అనే విషయానికి వస్తే…

Upasana: రెండు కోట్ల విలువ చేసే వజ్రం…


తమన్నా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో తమన్నాకు ఫిదా అయినటువంటి ఉపాసన ఏకంగా తనకు ఈ వజ్రాన్ని కానుకగా అందించారని తెలుస్తోంది. ఈ వజ్రం సుమారు రెండు కోట్ల రూపాయల వరకు విలువ చేస్తుందని సమాచారం. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ఈమె జైలర్ సినిమాతో పాటు చిరంజీవి భోళా శంకర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.