మెగా ఫ్యాన్స్ కి షాక్.. బట్టతలతో కనిపించిన ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్.. ..?

0
163

ఉప్పెన మూవీ తో బెస్ట్ డెబ్యూ చేసిన వైష్ణవ్ తేజ్ తాజాగా ఓ వీడియో లో బట్టతలతో కనిపించి అందరిని షాక్ కి గురిచేశాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా, మెగా స్టార్ చిరు చిన్న మేనల్లుడు గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమా తో స్టార్ హీరో అయిపోయాడు.. విడుదలై చాలా రోజులే అవుతున్నా ఉప్పెన సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది.. సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడు.. ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని వెయిట్ చేశారు.. ఆ నిరీక్షణ కి ప్రతిఫలం దక్కింది.

ఎక్కడా చూసినా ఉప్పెన మాయే కనిపిస్తుంది..ఏ ప్రేక్షకుడి నోటా విన్నా సినిమా హిట్ అన్న మాటే వినిపిస్తుంది. ముఖ్యంగా వైష్ణవ తేజ్ నటనకు అందరు ఫిదా అయిపోయారు.. అలాగే హీరోయిన్ కృతి శెట్టి నటనకు కూడా ముగ్దులైపోయారు ప్రేక్షకులు.. ఆమె అభినయానికి ఎంతగానో ఆకర్షితులవుతున్నారు.. ఇదిలా ఉంటే తాజాగా బయటకి వచ్చిన ఓ మ్యాజిక్‌ వీడియో లో వైష్ణవ్ తేజ్ బట్టతలతో కనిపించాడు.. ఇందులో ఓ వైన్‌ ఖాళీ బాటిల్‌ని టేబుల్‌పై పెట్టి దాన్ని తన మ్యాజిక్‌ ద్వారా తనవైపు లాగాడు.ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. వైష్ణవ్‌ తేజ్‌ ఈ మ్యాజిక్‌ ఎలా చేశాడని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత వరకు బాగానే ఉంది, వైష్ణవ్‌ తేజ్‌ మ్యాజిక్‌ కంటే మరో విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో వైష్ణవ్‌ తేజ్‌ బట్టతలతో కనిపించడం చూస్తుంటే ఉప్పెన సినిమాలో ఆయన ఫుల్‌ హెయిర్‌తో ఉన్నారు. కాకపోతే సైడ్‌కి కాస్త హెయిర్‌ ఊడిపోయినట్టు కనిపించింది. పెద్దగా ఉన్న హెయిర్‌తో దాన్ని మ్యానేజ్‌ చేశాడని అంతా అనుకున్నారు.కానీ ఇప్పుడు అసలు నిజం బయటపడింది. వైష్ణవ్‌ తేజ్‌ బట్టతల అనే విషయం బయటపడింది. వీడియోలో ఆయన తలపై సగానికిపైగా ముందుభాగం ఆయిల్‌ పూసినట్టుగా లైట్‌కి మెరుస్తుంది. దీంతో మెగా అభిమానులు షాక్‌ అవుతున్నారు. తాజాగా వైరల్‌ అవుతున్న మ్యాజిక్‌ వీడియో ఇప్పటిదేనా? లేక పాతదా? ఒకవేళ పాతదైతే హెయిర్‌ ట్రాన్స్ ప్లాంటేషన్‌ చేసుకుని ఉంటాడని, లేటెస్ట్ వీడియో అయితే కచ్చితంగా విగ్గుతోనే మ్యానేజ్‌ చేసి ఉంటాడని అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here