టాలీవుడ్ లో తన డెబ్యూ సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి.. ఇటీవలే వైష్ణవ్ తేజ్ సరసన ‘ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.. ఇక తన మొదటి సినిమా ‘ఉప్పెన’ రిలీజ్ కాకముందే ఏకంగా రెండు సినిమాలకు సైన్ చేసిందంటేనే.. కృతికి ఉన్న డిమాండ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.నిజానికి ఈ కొత్త భామ గొప్ప అందగత్త ఏమి కాకపోయినా, మంచి నటీ అని ఒక్క సినిమాతోనే ఘనంగా నిరూపించుకోగలిగింది. దానికితోడు మొదటి మూవీ సెన్సషనల్ విజయం సాధించడంతో ఆమె క్రేజ్ తారాస్థాయికి పోయింది. అందుకే ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో కూడా వరుస ఛాన్స్ లు వస్తున్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు చేస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత వచ్చే ఏడాది చివర్లో రాజమౌళితో సినిమా ఉంటుంది. అయితే ఈ మధ్యలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ కనుక మహేష్ తో సినిమా మొదలుపెడితే, హీరోయిన్ గా కృతికి అవకాశం ఉంటుందని.. ఈ సినిమా హారిక హాసిని బ్యానర్ లోనే ఉంటుందని.. ఇప్పటికే నిర్మాతలు కృతి డేట్స్ ని కూడా బుక్ చేశారని తెలుస్తోంది.కాగా కృతి శెట్టి ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’లో ఒక రొమాంటిక్ క్యారెక్టర్ లో నటిస్తోంది.

అలాగే, మరో ఇంట్రస్టింగ్ సినిమాలో సుధీర్ బాబు సరసన ఇంద్రగంటి డైరెక్షన్ లో కూడా నటిస్తోంది. ఏది ఏమైనా మహేష్ బాబు సరసన కృతికి నటించే ఛాన్స్ వస్తే.. అమ్మడు కెరీర్ ఓవర్ నైట్ లోనే మారిపోతుంది. రష్మిక మహేష్ పక్కన నటించిన తరువాత, ఆమెకు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి..ఇక వీటితో కచ్చితంగా కృతి శెట్టి స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here