Urfi Javed : నేను పబ్లిక్ ఫిగర్ నే కానీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా.. ఫ్లైట్ లో ఫైర్ అయిన నటి ఉర్ఫి జావేద్

0
40

Urfi Javed : బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్.. బిగ్ బాస్ షో తో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ అమ్మడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. రకరకాల వింత వింత ఫ్యాషన్ డ్రస్సులతో నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది ఉర్ఫీ. అంతేకాదు కొన్ని సార్లు ఆమె చేసే పనులు కూడా వివాదాస్పదం అవుతుంటాయి. ఇటీవల టమాటాలు చెవి దిద్దులుగా పెట్టుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది.

అయితే తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది ఈ అమ్మడు. విమానంలో తానూ వేధింపులకు గురయినట్టు తెలుపుతూ తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని పెట్టింది ఉర్ఫీ జావేద్. ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్ గా మారింది. “నేను ముంబై నుంచి గోవా వెళ్తున్న సమయంలో విమానంలో ఒక వ్యక్తి నా దగ్గరకి వచ్చి నా గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు. నాకు కోపం వచ్చి నేను అతనితో వాదనకు దిగాను.

ఆ సమయంలో అతనితో పాటు ఉన్న ఒక వ్యక్తి నా దగ్గరకి వచ్చి మా ఫ్రెండ్ తాగి ఉన్నాడు.. ప్లీజ్ మన్నించి వదిలేయండి అని వేడుకున్నాడు. తాగి ఉంటే మహిళలను ఇలా వేధిస్తారా? అంటూ గట్టిగా అరిచాను. అంతే కాదు నేను పబ్లిక్ ఫిగర్ నే కానీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా.. ” అంటూ తన స్టోరీ లో రాసుకొచ్చింది ఉర్ఫీ జావేద్.