Urvashi Rautela: ఏపీ సీఎం పవన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ఊర్వశి రౌతేలా… ఏకిపారేస్తున్న నేటిజన్స్?

0
48

Urvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ హీరోలుగా నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా ఈ సినిమా నేడు విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ సినిమాలో మై డియర్ మార్కండేయ అనే సినిమాలో ముంబై ముద్దుగుమ్మ ఊర్వసి నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఊర్వశి ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమా నేటి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈమె ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ పోస్టుల్లో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి అంటూ ఈమె పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి బ్రో ది అవతార్ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది రేపే ఈ సినిమా విడుదల కాబోతుంది అందరం మళ్ళీ కలుద్దాం అంటూ ఈమె పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సంచలనగా మారింది. దీంతో నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Urvashi Rautela: ఆ మాత్రం జ్ఞానం లేదా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనే విషయాన్ని ఈమె మర్చిపోయి ఇలాంటి పోస్ట్ చేశారా లేకపోతే పవన్ కళ్యాణ్ ని సీఎం అనుకొని ఇలాంటి పోస్ట్ చేశారా అని కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అని పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మాత్రమేనని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియని పొజిషన్లో ఉన్నారా అంటూ ఈమె పై మండిపడుతున్నారు.