అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో మరణించిన వారి సంఖ్య భారీగా నమోదవుతుండటం మరింత బాధించే అంశం. తాజగా అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ లో కరోనా కలకలం రేగింది. వైట్ హౌస్ లో పనిచేసే భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి దగ్గరగా మెలిగిన సిబ్బంది అందరిని క్వారంటైన్ చేసారు. అలాగే వారికి కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు.

అదే సమయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ రిపోర్టులో ఇద్దరికే నెగెటివ్ వచ్చినట్టు తెలిపారు వైట్ హౌస్ సిబ్బంది. కాగా ఇప్పటికే అమెరికాలో 12,69,025 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 75,490 మంది మరణించగా.. మరో 2,13,113 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్చి అయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం 9,80,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
One of President Trump's personal valets has tested positive for coronavirus, CNN has learned https://t.co/KCfYIOnt0r pic.twitter.com/10EBXThh1P
— CNN Breaking News (@cnnbrk) May 7, 2020




























