ఈ అనంతమైన విశ్వంలో మానవ మనుగడకు భూమిపై మాత్రమే అనుకూల వాతావరణం ఉంది.అయితే ఈ భూమిపై కాకుండా మరే గ్రహంలోనైనా మానవ మనుగడకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయనే విషయం గురించి కొన్ని సంవత్సరాల నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతర జీవులు ఉన్నాయనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ఇది నిజమా? కాదా? అనే సందేహం తరచూ వస్తుంటుంది. ఈ క్రమంలోనే కొందరు చెప్పే విషయాలు ఎంతో షాక్ కి గురి చేస్తుంటాయి.

ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఓ మహిళ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనను తెలియజేసింది.సాధారణంగా మనుషుల్ని మనుషుల కిడ్నాప్ చేయడం గురించి విన్నాం కానీ ఈమె మాత్రం ఏలియన్స్ ఇప్పటికే యాభై రెండు సార్లు కిడ్నాప్ చేశాయని చెప్పడంతో అందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పౌలా అనే మహిళ 1982లో తొలిసారి స్పేస్‌షిప్‌ను చూశాను. కొన్ని క్షణాల తర్వాత నేను దాని లోపల ఉన్నాను. అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. స్పేస్‌షిప్‌ లోపలంతా ఎంతో నిశ్శబ్ధ వాతావరణం ఏర్పడి ఉందని తెలిపారు. ఈ నిశ్శబ్దమైన వాతావరణంలో తనకు ఏమీ కనిపించడం లేదని కళ్ళు నులుముకొని చూసేసరికి ఒక వింత ఆకారం తన ముందు ప్రత్యక్షమయిందనీ దానికి మూడు చేతులు కలిగి ఉండి మూడు లైట్లను పట్టుకుని కనిపించినట్లు మహిళ తెలిపారు.

నా బాల్యం నుంచే ఏలియన్స్ నన్ను బెడ్రూమ్ కిటికీ నుంచి ఏలియన్ తీసుకెళ్ళి పోయేవని, ఏలియన్ తీసుకెళ్లిన తర్వాత నాలుగు గంటల పాటు తను ఎవరికీ కనిపించకుండా ఉండేదని, నాలుగు గంటల తర్వాత తిరిగి ఏలియన్స్ బెడ్ రూమ్ లోనే వదిలేసి వెళ్లేవనీ తెలిపారు. తనను కిడ్నాప్ చేసిన ఏలియన్స్ ఎలా ఉంటాయో ఊహా చిత్రాన్ని గీయడమేకాకుండ అవి తనను కిడ్నాప్ చేసేటప్పుడు ఆయన గాయాలను కూడా మహిళ చూపించింది.ఈ విషయం తెలిసిన కొందరు ఆమె మాటలను కొట్టిపారేయగా మరికొందరు నిజమేనేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here