నాని 25వ సినిమాగా సుధీర్ బాబు తో వస్తున్న V మూవీ ట్రైలర్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్న V మూవీలో నివేద థామస్, అతిధి రావు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.

సినిమా యూనిట్ విడుదల చేసిన V మూవీ ట్రైలర్ దాదాపు ఒక నిమిషము 45 సెకండ్ల నిడివిని కలిగి ఉంది. నేచురల్ నాని డార్క్ మోడ్, సైడ్ లైటింగ్ లో ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఇదివరకు నాని సినిమాలు అన్ని కూడా పాజిటివ్ షేడ్స్ లో ఉన్న ఇప్పుడు వస్తున్నా V మూవీ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని తెలుస్తుంది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ V మూవీ కథ సుధీర్ బాబు కు చెప్పడంతో చాలా ఎగ్జయిట్ కావడం జరిగిందని ఇదే కథ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు చేస్తే బాగుంటుందని అయినా మేము ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడికి తెలిపినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకోవడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here