V. V. Vinayak : మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన దర్శకుడు వి వి వినాయక్. గాల్లో సుమోలు లేయడం, హీరోలు తొడలు కొట్టడం వంటి ట్రెండ్ తెచ్చాడు. మాస్ ఆడియన్స్ కి హీరోలను కనెక్ట్ చేయడంలో దిట్టగా పేరున్న వినాయక్ కామెడీ కూడా హీరోలతో చేయించగలడు. అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాలు తీసిన అది, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలు తీసిన అది వినాయక్ కే చెల్లింది. కానీ ప్రస్తుతం వినాయక్ కెరీర్ అంత బాగా ఏం లేదు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన వి.వి ప్రస్తుతం సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇంటెలిజెంట్ సినిమా తరువాత గ్యాప్ ఇచ్చాడు వినాయక్.

ఎన్టీఆర్ తో సినిమాకు కొడాలి నాని అడ్డుపుల్ల వేసాడు…
ఒక మంచి ప్రేమ కథను సిద్ధం చేసుకుని అది నల్లమలుపు బుజ్జి సహాయంతో ఎన్టీఆర్ కి వినిపించాలని అనుకుని వెళ్లగా ఎన్టీఆర్ కొంత సమయం మాత్రమే వినడానికి ఇచ్చాడు. హీరోయిన్ ఇంట్రడక్షన్ చెప్పగానే ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యాడు రెండు గంటలు స్టోరీ విన్నాడు అన్ని ఒక అనుకున్నాక కొడాలి నాని ఎంటర్ అయి సినిమా చేయొద్దు లవ్ స్టోరీ వద్దు మనకు ఇపుడు అని తారక్ కి చెప్పాడు.

ఇక నాకు నో ఎలా చెప్పాలో తెలియక తారక్ చాలా సతమతం అవుతుంటే నేను ఇంకో కథ చెబుతానని కేవలం రెండు సన్నివేశాల ఆధారంగా కథను రెండు రోజుల్లో రెడీ చేసుకుని చెప్పి ఒప్పించాను అదే ‘ఆది’ సినిమా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ ఆ సినిమా కథను రెండు రోజుల్లో రాసాను అది నా అవసరం అంతకు ముందు చెప్పిన లవ్ స్టోరీ నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏళ్ళు ఆ స్టోరీ మీద ఆలోచించాను అంటూ వినాయక్ చెప్పారు. ఇక ఆ సినిమా తరువాత వినాయక్ టాప్ డైరెక్టర్ అయిపోయాడు. ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ వచ్చేసింది. అయితే చాలా ఫాస్ట్ గా కథను రాయడంలో పూరీ జగన్నాథ్ తో పోటీ పడేవాళ్ళు ఎవరు లేరంటూ వినాయక్ చెప్పారు.