V. V. Vinayak : ఆది సినిమాతో మొదలు పెట్టి దిల్, సాంబ, అదుర్స్, లక్ష్మి, యోగి, చెన్నకేశవరెడ్డి, అల్లుడు శీను, బద్రీనాథ్, ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలతో అలరించిన మాస్ డైరెక్టర్ వినాయక్ తన సినిమాలకు ఈ మధ్య కాలంలో కొంత బ్రేక్ ఇచ్చాడు. ఇంటెలిజెంట్ సినిమా తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అంతలో కరోనా, నటుడుగా కూడా సినిమాల్లో చేస్తున్న వినాయక్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లుడు శీను సినిమా హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో రాజమౌళి సినిమా ఛత్రపతి రీమేక్ ను హిందీ లో తీస్తున్నాడు.

గౌతమ్ రాజు గారి గురించి ఆ వార్తలు వినలేక పోయాను…
సీనియర్ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు గారు ఈమధ్యనే మరణించారు. ఇక ఆయన మరణానికి తరువాత ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చాలా మంది ఆదుకున్నారు వారికి అప్పులు ఇలా ఉన్నాయి అంటూ వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. ఇక వినాయక్ గౌతమ్ రాజు గారికి శిష్యుడనే చెప్పాలి. వినాయక్ ప్రతి సినిమాకు గౌతమ్ గారే ఎడిటర్ గా పని చేసారు.

ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుండి గౌతమ్ గారితో పనిచేసారు. ఇక ఆయన దగ్గర ఎడిటింగ్ నేర్చుకున్నారట వినాయక్, ఆయన చనిపోయినప్పుడు ఆయన మీద వచ్చిన వార్తలకు స్పందించారు. హాస్పిటల్ బిల్స్ మీరే కట్టారని తెలిసింది అని అడుగగా ఈ విషయంలో చాలా ఫీల్ అయ్యాను, ఆయన ఆర్థికంగా బాగున్నారు, ఎవరు సహాయం చేయాల్సిన పరిస్థితి లో ఆయన లేరు. అలాంటిది ఆయన పోయాక ఇలాంటి వార్తలు అసలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు.
చంద్రబాబు ను కొడాలి నాని అందుకే తిడతాడు…

సాంబ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కొడాలి నాని ఎన్టీఆర్ కి బాగా ఆప్తుడు. అప్పటి ఎలక్షన్లో కొడాలి నాని కి గుడివాడ సీట్ ను ఎన్టీఆర్ చంద్రబాబుని అడిగి ఇప్పించాడు. అప్పుడు నేను వెళ్ళాను చంద్ర బాబు దగ్గరికి అని చెప్పాడు వినాయక్. ఇపుడు ఎందుకు కొడాలి నాని మరి చంద్రబాబు ను తిడతాడు అని అడుగగా మొదటి నుండి కొడాలి నాని కి చంద్రబాబు అంటే నచ్చదు. సీనియర్ ఎన్టీఆర్ విషయంలో నాని కి చంద్రబాబు అంటే నచ్చదు. కొన్నిసార్లు ఆ తిట్టడం మరీ ఎక్కువైనప్పుడు ఏంటి మరీ అలా అనిపిస్తుంది కానీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి అని నేను అడగను అంటూ వివరించారు.



























