V. V. Vinayak : బాలకృష్ణ సినిమాల్లో సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు లాంటి ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మాస్ జనం ఊగిపోయారు. సమరసింహారెడ్డి కంటే ముందే వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాలో ఫ్యాక్షన్ నేపథ్యం వచ్చిన సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఫ్యాక్షన్ సినిమాలంటే మాత్రం బాలయ్యే పెట్టింది పేరు. సమరసింహారెడ్డి తో మొదలయి, నరసింహా నాయుడు వంటి బ్క్ బస్టర్ ఇచ్చిన బాలకృష్ణ ఆ తరువాత తీసిన చెన్నకేశవ రెడ్డి మాత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేదు.

ఆయనతో ట్రావెల్ అయ్యింటే సినిమా ఫలితం వేరేలా ఉండేదేమో…
అప్పటికే మాస్ మసాలా సినిమాలకు బాలయ్య బ్రాండు అంబాసిడర్ గా ఉన్నాడు. ఇక ఆది లాంటి మాస్ సబ్జెక్టు తో ఎన్టీఆర్ తో సూపర్ హిట్ అందుకున్నాడు వినాయక్. ఇక వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి అలాంటి సమయంలో సినిమా ఆశించినత విజయాన్ని అందుకోలేదు. కానీ సినిమా ప్లాప్ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఒప్పుకోరు. అభిమానూలు మాత్రమే కాదు జనరల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా ప్లాప్ అంటే ఒప్పుకోరు. బాలయ్య సినిమాల్లో యాంటీ ఫ్యాన్స్ కి కూడా నచ్చిన సినిమా చెన్నకేశవ రెడ్డి. ఒక క్లాసిక్ సినిమాగా దీన్ని ఈ సినిమా అభిమానులు వర్ణిస్తారు.

అలాంటి సినిమా ఫలితం అంత బాగా రాకపోడానికి కారణాలు వివరించారు వినాయక్ గారు. సినిమా కోసం పవర్ ఫుల్ డైలాగ్ రైటర్స్ అయిన పరుచూరి సోదరులలో పరుచూరి వెంకటేశ్వరరావు గారితో ట్రావెల్ అయ్యానని వినాయక్ ఈ మధ్య పాల్గొన్న ఇంటర్వ్యూ లో తెలిపారు. ఆయనతో క్లోజ్ గా ఉండటం వల్ల అయన ఇన్పుట్స్ సినిమాకోసం తీసుకున్నానని అలా కాకుండా అయన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ గారితో ట్రావెల్ అయ్యుంటే సినిమా ఫలితం వేరేలా ఏమైనా ఉండేదేమో అంటూ అభిప్రాయపడ్డారు. దీనికి కారణం పరుచూరి గోపాల కృష్ణ గారు మాస్ సినిమాల స్క్రిప్ట్ లో దిట్ట. వెంకటేశ్వర్రావు గారు ప్రేమ కథలు, కుటుంబం కథలలో దిట్ట అందుకే ఒకవేళ గోపాల కృష్ణ గారితో కలిసి పనిచేసుంటే సినిమాలో మార్పులు ఉండేవి, ఫలితం మారుండేది అని వినాయక్ భావించి ఉండవచ్చు.



























