ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి భీపత్స్యం సృష్టిస్తోంది.. ఎక్కడ చూసినా మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. సమస్తమానవాళికి పెనుముప్పుగా తయారయింది కరోనా వైరస్. అయితే తాజగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి డా. డేవిడ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని హెచ్చరించింది డబ్ల్యూహెచ్ఓ. ప్రపంచ మానవాళి ఈ మహమ్మారి ముప్పు నుండి బయటపడే సూచనలు లేవని హెచ్చరించింది. కోవిడ్-19 ను అంతమొదించే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ఈ ముప్పు తప్పదని తేల్చిచెప్పింది.

దేశాలు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. కరోనా 2009 లో ప్రపంచ వణికించిన స్వైన్ ఫ్లూ కంటే అత్యంత ప్రమాదకరమైనదని, పది రేట్లు ప్రాణాంతకరమైన వ్యాధి అని హెచ్చరించారు.

మరో పక్క ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుంది. ప్రసుతం ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 19,18,855 మంది కాగా..ఇందులో మరణించిన వారి సంఖ్య 1,19,588 మంది మరియు రికవర్ అయిన వారి సంఖ్య 4,48,998 గా నమోదయ్యాయి.



























