కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక థర్డ్ వేవ్ కూడా వస్తుందని, అది పిల్లపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్న నేపద్యంలో చిన్నారులపై పాట్నా ఎయిమ్స్ హాస్పిటల్‌లో కోవిడ్ వాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో సుమారు 525 మంది చిన్నారులకు కోవాగ్జిన్ టీకాలు ఇవ్వనున్నట్లు కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా అయన మాట్లాడుతూ.. సుమ్మరు 525 మంది పిల్లలకు టీకాలు ఇవ్వనున్నామని, టీకాలు ఇచ్చేముందు పిల్లలకు ఆర్టీ పీసీర్, యాంటిజెన్ టెస్టులు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ నేపధ్యంలోచిన్నారుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు.
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సంస్థకు గతనేలలోనే అనుమతి లభించిన విషయం తెలిసిందే.. అయితే రెండేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లపై కోవాగ్జిన్ టీకాలు ట్రయల్స్ చేయనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్, నాగపూర్‌లోని మెడిట్రినా హాస్పిటళ్లలోనూ ట్రయల్స్ జరగనున్నాయి.































