Vadde Naveen : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా తెలుగు సినిమాలకు పరిచయం అయ్యాడు వడ్డే నవీన్. చేసినది తక్కువ సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో తన సినీ ప్రయాణం మొదలు పెట్టాడు. ‘పెళ్లి’ సినిమా మంచి విజయాన్ని అందించింది. కేవలం 30 సినిమాలలో మాత్రమే నటించిన వడ్డే నవీన్ తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించడం అలాగే తక్కువ సమయంలోనే ఫేడ్ అవుట్ అవ్వడం జరిగింది. అయితే కుటుంబ కథా చిత్రాలతో అభిమానులకు బాగా దగ్గరయ్యాడు.

అలీ షో కి రానున్న వడ్డే నవీన్…
వడ్డే నవీన్ ఆఖరుగా మనోజ్ హీరోగా వచ్చిన ‘ఎటాక్’ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించారు. ఆ తరువాత కెమెరా ముందుకు రాలేదు. ఇటీవల కృష్ణంరాజు కు నివాళి అర్పించడానికి వచ్చారు. అయితే ఇప్పుడు అలీతో సరదాగా షో కు వడ్డే నవీన్ రానున్నట్లు సమాచారం. ఎప్పుడు ఈ షో కి సంబందించిన వీడియోలు విడుదల చేస్తారు, అభిమానులు వడ్డే నవీన్ ఎప్పుడు వస్తారు అని అడుగుతుందటంతో షో నిర్వాహకులు వడ్డే నవీన్ ను కలవడం దానికి సంబందించిన వీడియో ని విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో లో షో నిర్మాత ప్రవీణ మాట్లాడుతూ వడ్డే నవీన్ నాకు, అలీ గారికి మంచి స్నేహితుడు. కాకపోతే ఆయన ప్రస్తుతం ఏ షోలకూ రావడం లేదని, ఇపుడైనా తమను తిట్టడం మానమని కోరింది.

అలీ మాట్లాడుతూ చెన్నైలో ఉన్నప్పుడు వడ్డే నవీన్ తాను స్నేహితులం అని, తమ ఇద్దరి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నేను చాలా సార్లు షో కి రమ్మని పిలిచాను కానీ ఆయన ఏదైనా అద్భుతం చేస్తే మళ్ళీ వస్తాను అని చెప్పేవారు. త్వరలోనే మా షో కి వస్తారు అని వీడియోలో చెప్పారు. దీంతో అభిమానులు పోనీలెండి ఇలాగైనా మళ్ళీ వడ్డే నవీన్ ని చూస్తాం, మా కామెంట్లకు రియాక్ట్ అయ్యి ఆయనను షో కి తీసుకువస్తున్నందుకు థాంక్స్ అని కామెంట్లు చేస్తున్నారు.






























