Vadde Naveen : టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాత అయిన వడ్డే రమేష్ తనయుడు వడ్డే నవీన్. ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. కొన్ని సినిమాలతోనే టాలీవుడ్ లో స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదేవిదంగా కొన్ని సినిమాలతోనే కెరీర్ కూడా ఆగిపోయింది.

ఇండస్ట్రీతో సంబంధం ఉన్న కుటుంబం అమ్మాయి తోనే పెళ్లి…
అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న వడ్డే నవీన్ గురించి ప్రస్తుతం చాలా మందికి తెలియకపోవొచ్చు. ఇంకా అతని వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలు కూడా కొంతమందికే తెలుసు. వడ్డే నవీన్ వివాహం ఇండస్ట్రీ లో పెద్ద కుటుంబం అయిన నందమూరి వారి అమ్మాయినే చేసుకున్నారు. నందమూరి తారక రామరావు గారి అబ్బాయి అయిన రామకృష్ణ కూతురు చాముండేశ్వరి తో వివాహం జరిగింది.

అయితే వడ్డే నవీన్, చాముండేశ్వరి లు కొన్ని వ్యక్తిగత కారణాల వలన వివాహ బంధానికి స్వస్తి పలికి విడాకులు తీసుకున్నారు. తరువాత వడ్డే నవీన్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రస్తుతం సంతోషంగా జీవితం గడుపుతున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వలనే వడ్డే నవీన్ సినిమాలకు దూరం అయ్యాడు అని ఇండస్ట్రీ లో సినిమా విశ్లేషకుల అభిప్రాయం.



































