Vadde Naveen : తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడు,మాజీ కేంద్ర మంత్రిగా చేసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు స్వర్గస్థులు అయిన విషయం తెలిసిందే. పోస్ట్ కోవిడ్ తర్వాత అనారోగ్య కారణాలతో కృష్ణంరాజు ఏఐజీ హాస్పిటల్ లో మరణించారు. సెప్టెంబర్ 11 ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కృష్ణం రాజు పార్తివ దేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన స్వగృహనికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ కు తరలించి, మధ్యాహ్నం నుండి అధికార లాంచనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కృష్ణంరాజు కడసారి చూపు కోసం వచ్చిన వడ్డే నవీన్…
రెబల్ స్టార్ కృష్ణం రాజు భౌతిక కాయాన్ని కడసారి చేసేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లారు. సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటికే చిరంజీవి, మహేష్ బాబు, అనుష్క, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు ఆయనకు నివాళులు అర్పించి, ప్రభాస్ కు కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అయితే కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వడ్డే నవీన్ కూడా ఆయన నివాసానికి వెళ్లారు.

కోరుకున్న ప్రియుడు, పెళ్లి, మా బాలాజీ వంటి సినిమాల్లో హీరోగా నటించి, అభిమానులను సంపాదించుకున్న వడ్డే నవీన్ ఎక్కువ కాలం సినిమాలలో కొనసాగాలేక పోయారు. మనోజ్ హీరోగా వచ్చిన ఎటాక్ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించిన నవీన్ తరువాత కనిపించలేదు. ఎప్పుడు పెద్దగా మీడియా ముందుకు రాని వడ్డే నవీన్ కృష్ణంరాజుతో వున్న అనుబంధంతో ఆయన కడసారి చూపు కోసం వచ్చారు. అయితే ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.



























