టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సుపుత్రులు హీరోలుగా పరిచయం అయ్యారు. ఎంతో మంది నిర్మాతలు వారి కొడుకులను టాలీవుడ్ లో హీరోలుగా పరిచయం చేసారు. ఇదే కోవలోకి వస్తారు వడ్డే నవీన్. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు వడ్డే నవీన్. అప్పట్లో వచ్చిన 1997 వ సంవత్సరంలో ‘కోరుకున్న ప్రియుడు’ అనే చిత్రం ద్వారా తెలుగుతెరకు కథానాయకుడిగా పరిచయం అయినా వడ్డేనవీన్. ఆ తరువాత కాలంలో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఆ తరహా చిత్రాలే ఎక్కువ గా చేసారు. అప్పట్లో ‘పెళ్లి’ చిత్రం వడ్డే నవీన్ కి చాలా పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వ భాద్యతలు వహించారు. ఆ తరువాత ఆయనకు పెద్దగా అవకాశాలు రాకవపోవడం, అడపా దడపా సినిమాలు వచ్చినా అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం వల్ల చాలా రోజుల క్రితమే నవీన్ సినిమాలకు దూరమయ్యారు.
అందుకు అయన కథల ఎంపిక ఒకరంగా కారణం అయితే మరో కారణం కూడా ఉందని చెబుతారు. అదే అయన ప్రేమ ఆ తరువాత పెళ్ళి. అయన ప్రేమించి పెళ్లి చేసుకున్నది నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ కూతురిని. ఆ తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడం, ఆనక వారిద్దరూ విడిపోయి విడాకులు తీసుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి. ఆ కోపంతోనే విధంగా నందమూరి కుటుంబం ఆయనను అవకాశాలు రాకుండా చేసిందని చెబుతారు. ఏది ఏమైనా మంచి అధితమైన నటుడు ఇండస్ట్రీకి దూరమవడం ప్రేక్షకులకు బాధాకరమైన విషయమే, ఇదంతా జమానా కాలం నాటి ముచ్చట. చాలావరకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో వడ్డే నవీన్ మర్చిపోయారు. వడ్డే నవీన్ మల్లి పెళ్లి చేసుకున్నాడా లేదా అయన కుటుంబం ఎలా ఉంటుంది అనే వార్తలు ఎప్పుడు ఎక్కడ బయటకు రాలేదు. ఎంతో low ప్రొఫైల్ మైంటైన్ చేయడం వడ్డే నవీన్ కి ముందు నుండి ఉన్న అలవాటు. ఇప్పుడు తాజాగా వడ్డే నవీన్ భార్య పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వడ్డే నవీన్ కూతురు చాల అందంగా ఉంది. అలాగే నవీన్ కొడుకు ధోవతి ఫంక్షన్ లో నటి మరియు వైసీపీ ఎమ్మెల్యే రోజా తో దిగిన ఫోటోలు షేర్ చేయడం తో ఈ కుటుంబం ఫోటోలు బయటకు వచ్చాయి. ఒక్కసారి వడ్డే నవీన్ కుటుంబం ఫొటోస్ చుసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మనం ఇక్కడ వడ్డే నవీన్ భార్య కూతురు కొడుకు ఫొటోస్ ని చూడవచ్చు.






























